పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలు ఏపీ సరిహద్దులకు రావొద్దంటూ సీఎం జగన్ ఒక విజ్ఞప్తి చేసారు. కరోనా కట్టడికి తెసుకోవాల్సిన చర్యపై ఉన్నతాధికారులతో సమేవేశం నిర్వచించిన జగన్. కేంద్ర హోమ్ శాఖ మార్గదర్శకాల ప్రకారం కేవలం వలసకులకు మాత్రమే రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతి ఉందని, మిగిలిన వారికీ అనుమతి లేదని స్పష్టం చేసారు. ప్రస్తుతం వలస కూలీలు వేలల్లో ఉన్నారని, వారందరిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించి, వైద్య పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో అనవసరంగా ఏపీ సరిహద్దుకు వచ్చి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడి వారు అక్కడే ఉండటం క్షేమమని తెలిపారు.

అంతేకాదు ప్రయాణాల వాల్ల కరోనా వ్యాప్తి భారీ పెరిగే అవకాశం ఉందని, ఈ క్రమంలో మీ ఇళ్లలో ఉన్న వయస్సు మళ్ళిన వారి ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెట్టినవారు అవుతారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు, దీనికోసం ప్రజలు అందరు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
































