ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. సీఎం జగన్ రేపు ఢిల్లీ పర్యటించాల్సి ఉంది. అయితే ఢిల్లీ లోని ముఖ్యనేతల అపాయింట్మెంట్ ఖరారు అవ్వకపోవడంతో రేపటి పర్యటన వాయిదా వేసుకున్నారు సీఎం జగన్.

అయితే తదుపరి ఎప్పుడు వెళ్తారు అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఖరాయయిన తరువాతనే ఆయన ఢిల్లీ వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాబోయే వారం రోజుల్లో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రేపు ఢిల్లీ వెళ్లాలని భావించిన జగన్ కానీ కేంద్ర మంత్రుల షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఆయన తన పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.































