గత కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు హాస్టల్లో ఎలాంటి సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారు ఉం డటానికి సరైన వసతులు లేక, ఆహార విషయంలో పోషకాహారలోపంతో ఉండేవి. అంతేకాకుండా రక్షణకు ప్రవాహరి గోడలు లేకపోవడంవల్ల బాలికలు ఎంతో ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ జగన్ సర్కార్ హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు ఒక శుభవార్త చెప్పింది.

2019 వ సంవత్సరంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యత విద్య, వైద్యానికి ఇచ్చారు. ఇందులో భాగంగానే నాడు నేడు కార్యక్రమం మొదలు పెట్టారు. ఇప్పటికే నాడు నేడు కార్యక్రమం తొలి విడతలో భాగంగా ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు నిర్మాణంతో పాఠశాలలు చక్కని రూపుదిద్దుకున్నాయి.

నాడు నేడు రెండవ విడతలో భాగంగా హాస్టల్ లో నివసించే విద్యార్థులకు అన్ని వసతులను కల్పించడంతో పాటు, అక్కడ నివసించే వారికి జగనన్న విద్యా కానుక పథకం వారికి కూడా వర్తించేలా అమలు చేయనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో అమలవుతున్న “జగనన్న గోరుముద్ద” మెనూ హాస్టల్లో నివసించే విద్యార్థులకు కూడా అమలు చేయనున్నారు.

నాడు నేడు కింద హాస్టల్ రూపురేఖలు మార్చాలని, అన్ని వసతులతో కూడిన నిర్మాణం ఉండాలని, అంతే కాకుండా అక్కడ నివసించే విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, రగ్గులు కల్పించాలని పేర్కొంది. అయితే ప్రభుత్వ సొంత భవనాలలో ఉన్న 4000 హాస్టల్ లో నాడు నేడులో వాటి రూపురేఖలు మారనున్నాయి. ఈ పథకం ద్వారా మన రాష్ట్రం మొత్తం దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here