Health News
ఆరోగ్య శ్రీ విషయం మరో శుభవార్త చెప్పిన జగన్..?
Published
4 years agoon
By
lakshanaఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య శ్రీ విషయంలో రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్రజలకు వచ్చే నెల 13వ తేదీ నుంచి 2,000 వ్యాధులకు ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయని భవిష్యత్తులో మరిన్ని వ్యాధులను జాబితాలో చేర్చే అవకాశం ఉందని తెలిపారు. ఆరోగ్య శాఖలో నాడు నేడు పనుల గురించి సమీక్ష నిర్వహించిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరాలకు అనుగుణంగా వైద్య ప్రక్రియలను చేపడతామని వెల్లడించారు.
అధికారులను నిధుల సమీకరణ, టెండర్ల ప్రక్రియ, పనులకు సంబంధించిన పూర్తి వివరాల గురించి జగన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు సీఎం జగన్ కు నాడు నేడు కింద చేపట్టే పనుల కోసం 17,300 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని… వైద్య కళాశాలల్లో చేపట్టే పనులకు 5,472 కోట్ల రూపాయలు అదనంగా అవసరమని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని గ్రామ, వార్డ్ సచివాలయాలను హెల్త్ క్లినిక్‌లు అందుబాటులోకి వచ్చేంత వరకు ఆరోగ్య శ్రీ రెఫరల్ పాయింట్లుగా మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం జగన్ రాష్ట్రంలో కొత్తగా ప్రజలకు అందుబాటులోకి రాబోతున్న వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్ లు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల నిర్మాణాల గురించి అధికారులతో చర్చించారు. మచిలీపట్నం, పులివెందుల, పాడేరు, పిడుగురాళ్ల వైద్య కళాశాలల నిర్మాణాలకు వచ్చే నెలలోగా టెండర్ల ప్రక్రియ చేపట్టాలని తెలిపారు.
నంద్యాల, మార్కాపురం, బాపట్ల, అనకాపల్లి, మదనపల్లి, ఏలూరు, నరసాపురం కాలేజీలకు టెండర్లు పిలవాలని చెప్పారు. రాజమహేంద్రవరం, పెనుకొండ, అమలాపురం, ఆదోని, విజయనగరంలలో జనవరిలో టెండర్లు పిలవాలని తెలిపారు.
You may like
KA Paul -Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను అందరూ మోసం చేస్తున్నారు.. నా దగ్గరకు వచ్చేయ్ తమ్ముడు.. పాల్ షాకింగ్ కామెంట్స్?
Kaikala Satyanarayana: ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన కైకాల.. శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు అంటూ!
ఎమ్మేల్యే రోజాపై విమర్శల వర్షం.. మంచి పనికి వెళ్లినా తప్పని తిప్పలు.. ఏమైందంటే..!
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త… త్వరలో 3,393 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!
జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. వారందరికీ సబ్సిడీ లోన్లు..?
నేడే అమ్మఒడి రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. కొత్తవాళ్లు ఎలా దరఖాస్తు చేయాలంటే..?
Featured
Butter Milk Side Effects: ఆరోగ్యానికి మంచిదని మజ్జిగ ఎక్కువ తాగుతున్నారా… ప్రమాదంలో పడినట్లే?
Published
10 months agoon
26 November 2023By
lakshanaButter Milk Side Effects: మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఎంతో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాము. ఇక మనం తీసుకునే ఆహార పదార్థాలలో తప్పనిసరిగా పెరుగు లేదా మజ్జిగ ఉండటం సర్వసాధారణం అయితే పెరుగుతో పోలిస్తే చాలామంది మజ్జిగ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మజ్జిగలో కూడా ఎన్నో పోషక విలువలు దాగి ఉండడంతో ప్రతిరోజు మజ్జిగ తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుందని భావిస్తూ ఉంటారు.
ఇలా మజ్జిగ తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడమే కాకుండా మన శరీరం కూడా హైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుందని భావిస్తూ చాలామంది మజ్జిగ తాగుతూ ఉంటారు. అయితే ఆరోగ్యానికి మంచిది కాదని మజ్జిగను ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం ప్రమాదంలో పడతామని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగను అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు మనల్ని వెంటాడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
పాలు పాల పదార్థాలలోనూ లాక్టోస్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది చాలామందిలో జీర్ణక్రియను పూర్తిగా మందగించేలా చేస్తుంది. ఎవరికైతే లాక్టోస్ ను జీర్ణం చేసే ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి కావు లాంటివారికి మజ్జిగ తాగటం వల్ల అవి జీర్ణం కాక వాంతులు అయ్యే పరిస్థితులు ఏర్పడుతుంటాయి అలాగే కడుపు నొప్పి రావడం కడుపు చాలా ఉబ్బర కావడం విరోచనాలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే ఇలాంటి వారు ఎక్కువగా మంచిగా తీసుకోకపోవడం ఎంతో మంచిది.
చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి…
ముఖ్యంగా ఈ సమస్య చిన్న పిల్లలలో అధికంగా కనబడుతూ ఉంటుంది. అలాంటివారు రోజుకు కేవలం ఒక గ్లాస్ మజ్జిగ తాగడం మంచిది ఇక చాలా మంది మజ్జిగలో ఉప్పు అధికంగా వేసుకొని తాగుతూ ఉంటారు ఇలా అధికంగా ఉప్పు వేసుకొని తాగడం వల్ల మన శరీరంలో ఉప్పు నిలువలు పెరిగిపోయి హై బీపీ రావడానికి కూడా కారణం అవుతుంది. ఇక మరికొందరికి చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక రోజు ఒక గ్లాస్ కి మించి మజ్జిగ తాగకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Featured
Pregnant After 40 Years: మహిళలు 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం మంచిదేనా… నిపుణులు ఏం చెబుతున్నారంటే?
Published
10 months agoon
25 November 2023By
lakshanaPregnant After 40 Years: ప్రస్తుత కాలంలో మహిళలు కూడా విద్యా ఉద్యోగం అంటూ పెళ్లిళ్లు చేసుకోవడం కూడా చాలా ఆలస్యంగా చేసుకుంటున్నారు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వెంటనే పిల్లలని ప్లాన్ చేయడం లేదు అందుకే ప్రస్తుత కాలంలో మహిళలందరూ కూడా 30 తర్వాత దాదాపు 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పిల్లలను కనడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలా మహిళలు 40 కి దగ్గర పడుతున్న సమయంలో పిల్లలను కనడం వారి ఆరోగ్యానికి మంచిదేనా పిల్లల ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందా అనే విషయానికి వస్తే…
40 సంవత్సరాల వయసు దగ్గర పడుతున్న సమయంలో పిల్లల్ని కనడం పెద్ద తప్పు అని నిపుణులు చెబుతున్నారు. పిల్లలను కనడానికి 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఎంతో మంచిదని ఈ సమయంలో పిల్లలను కనడం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా జన్మిస్తారు. 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి మహిళలలో విడుదల అయ్యే అండాల నాణ్యత పూర్తిగా తగ్గిపోతుంది తద్వారా పిల్లలు పుట్టడం కూడా చాలా అరుదు ఒకవేళ పుట్టిన ఎన్నో రకాల సమస్యలతో జన్మిస్తూ ఉంటారు.
40 సంవత్సరాల వయసు దగ్గరకు పడే మహిళలలో రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడే వారు పిల్లల్ని కనుక కణాలని భావిస్తే వారి జీవితాన్ని కూడా ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. 30 సంవత్సరాల లోపు మొదటి బిడ్డకు జన్మనివ్వడం ఎంతో మంచిది అయితే మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి ఆరు ఏడు నెలల వ్యవధిలోని మరొకసారి గర్భం దాల్చడం చాలా ప్రమాదకరం.
18 నెలల గ్యాప్ అవసరం…
మొదటి బిడ్డకు రెండవ బిడ్డకు 18 నుంచి 23 నెలల గ్యాప్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఇలా ఉంటేనే రెండో బిడ్డకు ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదు. అలా కాకుండా ఐదు నెలల గ్యాప్ లోనే మరోసారి గర్భం దాల్చితే అది తల్లి బిడ్డల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ఇలా గర్భం దాల్చడం వల్ల రక్తస్రావం జరగడం, తల్లి ఆరోగ్యం పై అధిక ప్రభావం చూపడం వంటివి జరుగుతుంటాయి.అందుకే పిల్లల విషయంలో సరైన ప్లానింగ్ ఎంతో అవసరం అని నిపుణులు చెబుతున్నారు.
Featured
Doctor Kiran : ఫోన్ వల్లే గుండె పోటు… వాక్సిన్ వల్ల జరుగుతోంది…: డాక్టర్ కిరణ్
Published
2 years agoon
8 March 2023By
BhargaviDoctor Kiran : కరోనా నీలి నీడలు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. నలభై ఏళ్ల లోపు వాళ్ళు గుండె పోటుతో చాలా మంది మరణించడం కలవరపెడుతోంది. ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చి మరణిస్తుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక్క రోజులోనే తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది మంది యుక్త వయసు వాళ్ళు గుండెపోటుతో అక్కడికక్కడే మరణించడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక అసలు యుక్త వయసు వారికి గుండెపోటు రావడం వంటివి ఎందుకు సంభవిస్తున్నాయి, దీనికి గల కారణాలు వంటి విషయాలను డాక్టర్ కిరణ్ వివరించారు.
వాక్సిన్ కాదు స్మార్ట్ ఫోన్ వల్లే గుండె పోటు…
మారుతున్న జీవన సరళి వల్ల ఆహారపు అలవాట్లు, పని అన్నీ మారిపోయి మనం ఊబకాయం, షుగర్ వంటి వ్యాధుల భారిన పడటం వలన ఇన్ని రోజులు గుండెపోటు మరణాలు సంభవించేవి. అయితే ఇప్పుడు యుక్త వయసులో ఉన్నవారికే ఎక్కువగా గుండెపోటు సంభవించడానికి గల కారణాలను డాక్టర్ కిరణ్ వివరించారు. యువతలో అనారోగ్యాలకు గుండె ఆరోగ్యం మీద చూపే ప్రభావాలలో మొదటిది ఫోన్ వాడకం.
గంటలు గంటలు ఫోన్లను చూస్తూ చేతులు కాళ్ళు కదల్చకుండా ఉంచడం వల్ల చాలా శరీర భాగలకు రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతాయి. అపుడు రక్తం సరఫరా చేయడానికి గుండె మరింత బలంగా కొట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందువల్ల గుండె మీద భారం అధికమై చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఇక బరువు ఉన్నట్టుండి తగ్గడం లేదా పెరగడం వల్ల కూడా ప్రమాదాలు ఎదురావుతున్నాయని తెలిపారు. ఇక కరోనా వాక్సిన్ వల్ల గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి అనేది అపోహ మాత్రమే, ఆ వాక్సిన్లు వేయించుకున్నందుకే మనం బ్రతికి ఉన్నాం అంటూ తెలిపారు.
Devara: చుట్ట మల్లే సాంగ్ డైరెక్టర్ కొరటాల కాదా.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ జాన్వీ?
Ntr: వచ్చే జన్మలో మీ రుణం తీర్చుకుంటా… ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!
Bramhaji: ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా మేడం.. బ్రహ్మాజీ ట్వీట్ వైరల్!
Sujatha: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సుజాత.. ఫోటోలు వైరల్!
Pawan Kalyan: తిరుపతి లడ్డు అపవిత్రం చేశారని మేము ఎక్కడా చెప్పలేదే… వారాహి సభలో పవన్ కామెంట్స్!
TDP MLA: చెల్లి అంటూనే మహిళతో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. వైరల్ అవుతున్న వీడియో?
Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!
Bollywood: తెరపై ప్రేక్షకులను భయపెట్టిన విలన్లు… వీరి భార్యలు గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Ambulance: ఘోరం… ఆంబులెన్సులో మహిళకు లైంగిక వేధింపులు.. నిండు ప్రాణాన్ని బలి తీశారుగా?
Nithya Menon: నిత్యామీనన్ మలయాళీ అమ్మాయి కాదా… తన అసలు పేరు అదేనా?
Trending
- Featured4 weeks ago
TDP MLA: చెల్లి అంటూనే మహిళతో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. వైరల్ అవుతున్న వీడియో?
- Featured4 weeks ago
Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!
- Featured4 weeks ago
Bollywood: తెరపై ప్రేక్షకులను భయపెట్టిన విలన్లు… వీరి భార్యలు గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Featured4 weeks ago
Ambulance: ఘోరం… ఆంబులెన్సులో మహిళకు లైంగిక వేధింపులు.. నిండు ప్రాణాన్ని బలి తీశారుగా?
- Featured3 weeks ago
Nithya Menon: నిత్యామీనన్ మలయాళీ అమ్మాయి కాదా… తన అసలు పేరు అదేనా?
- Featured2 weeks ago
Abhay Naveen: బిగ్ బాస్ ను అందుకే తిట్టాను… అసలు కారణం బయటపెట్టిన అభయ్ నవీన్!
- Featured4 weeks ago
Soundarya: సౌందర్య చనిపోతుందని ఆ వ్యక్తికి ముందే తెలుసా… ఆమె మరణంలో కుట్ర జరిగిందా?
- Featured3 weeks ago
Manikanta: అలా మాట్లాడటం సరికాదు.. మణికంఠ భార్యకు మద్దతుగా నిలిచిన సోదరి!