ఏపీ ఉద్యోగులకు అలర్ట్.. 2021 సంవత్సరంలో సెలవు దినాలివే..?

0
339

2020 సంవత్సరానికి గుడ్ బై చెప్పడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. కరోనా విజృంభణ వల్ల 2020 సంవత్సరంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రజలు 2021 సంవత్సరలోనైనా సాధారణ పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఏడాది బ్యాడ్ ఇయర్ అని ఈ సంవత్సరం త్వరగా ముగిస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కొత్త సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో సెలవు దినాలకు సంబంధించిన హాలిడే క్యాలెండర్ ను విడుదల చేసింది.

ఏపీ ఉద్యోగులకు 2020 సంవత్సరంలో 22 సాధారణ సెలవులు, 18 ఆప్షనల్ సెలవులు ఉన్నాయి. మొత్తం 44 సెలవు దినాలు ఉండగా హోలీ పండుగ రోజున కూడా జగన్ సర్కార్ సెలవు దినంగా ప్రకటించింది. భోగి, సంక్రాంతి, కనుమ, రిపబ్లిక్ డే, మహా శివరాత్రి, హోళీ, గుడ్ ఫ్రైడే, బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, ఉగాది, అంబేద్కర్ జయంతి, శ్రీరామ నవమి, రంజాన్, బక్రీద్, మొహర్రం, కృష్ణాష్టమి, వినాయక చవితి, గాంధీ జయంతి, దుర్గాష్టమి, విజయదశమి, మిలాదునబి, దీపావళి, క్రిస్ మస్ సాధారణ సెలవులుగా ఉన్నాయి.

ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే ఆదివారం రోజున రావడం గమనార్హం. ఈ సెలవులు కాకుండా నూతన సంవత్సరం, హజరత్ అలీ బర్త్ డే, షబ్ ఈ మీరజ్, సాహదత్ హజ్రత్ అలీ, జుమా అతుల్ విదా, బసవ జయంతి, బుద్ద పూర్ణిమ, రథయాత్ర, ఈద్ ఈ గధీర్, పార్శీ న్యూ ఇయర్ డే, 9వ ముహర్రం ఆప్షనల్ సెలవులుగా ఉన్నాయి. ఆప్షనల్ సెలవులు కొందరికి మాత్రమే వర్తిస్తాయి. మహావీర్ జయంతి కూడా సెలవు రోజునే రావడం గమనార్హం.

2021 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో అత్యధికంగా 5 సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు కాకుండా ఆదివారం తో పాటు కొందరు ఉద్యోగులకు రెండో శనివారం, నాలుగో శనివారం సెలవు దినాలుగా ఉంటాయి. సెలవులపై అవగాహన ఉంటే ముందుగానే ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో ప్లాన్ చేసుకోవచ్చు.