Bandla Ganesh: కమెడియన్ గా తన కెరీర్ ను మొదలు పెట్టి.. ప్రస్తుతం బిగ్గెస్ట్ నిర్మాతగా పేరు పొందిన వ్యక్తి బండ్ల గణేష్. రవితేజ ఆంజనేయులు మూవీతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్… తొమ్మిది చిత్రాల వరకు నిర్మించారు. ఇలా బండ్ల గణేష్ నిర్మాతగా మారాడు.

ఇదంతా ఇలా ఉండగా.. ప్రస్తుతం అతడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటాడు. అయితే అతడు చేసే ట్వీట్స్ ఇటీవల కాంట్రవర్సీలకు అడ్డాగా మారుతున్నాయి.
తాజాగా అతడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రకాశం జిల్లా ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లుకు ఇచ్చిన రూ. 1.25 కోట్ల చెక్ బౌన్స్ అయిందట.

దీంతో సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతో బండ్లగణేష్ కు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని కోర్టు పలుసార్లు ఆదేశించినప్పటికీ బండ్ల గణేష్ స్పందించలేదు. దీంతో అతడిని అరెస్టు చేసి.. కోర్డుకు హాజరు పరచాలని పోలీసులను జడ్జి ఆదేశించాడు. ఈ క్రమంలో నేడు కోర్టులో బండ్ల గణేష్ హాజరుకానున్నాడు.
ఏపీలో బండ్ల గణేష్ పై మరో కేసు కూడా..
అతడికి అంతకముందు ఏపీలో మరో కేసు కూడా నమోదైంది. అది కూడా ఆర్థిక వ్యవహారానికి సంబంధించింది కావడం విశేషం. కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర రూ.13 కోట్లు తీసుకున్నారట. అయితే తిరిగి చెల్లించకపోవడంతో.. బండ్ల గణేష్‌పై కడపలో మహేష్ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అప్పట్లో అతడికి నోటీసులు జారీ చేసినా.. స్పందించలేదు. దీంతో అప్పుడు కూడా అతడిని కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశించినా వినిపించుకోలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు కడప మెజిస్ట్రేట్. ఇలా అతడు ఇదే వ్యవహారానికి సంబంధించి రెండో సారి కోర్టు ద్వారా విచారణకు హాజరు కావాలని ఆదేశించడం రెండోసారి కావడం విశేషం.

































