AryanKhan: విమానాశ్రయంలో బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది . ఆ వీడియో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌దేనని నెటిజన్లు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే

వీడియోలో ఉన్న వ్యక్తి కచ్చితంగా ఆర్యన్ కాదని ఆ క్లిప్‌లో కనిపించే వ్యక్తి ‘ ట్విలైట్ ‘ నటుడు బ్రోన్సన్ పెల్లెటియర్ అని తెలుస్తోంది. మత్తులో ఉన్న స్థితిలో.. అతను 2012లో లాస్ ఏంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని లాబీ నేలపై మూత్ర విసర్జన చేశాడు.

అప్పటి నుంచి కూడా ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే షారుఖ్ ఖాన్ అంటే పడని వారు కొంతమంది ఆ వీడియోలో ఉన్న వ్యక్తి కచ్చితంగా ఆర్యన్ ఖానే అంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు. అయితే అందులో ఉన్న వ్యక్తి ముఖ కవలికలు ఆర్యన్ ఖాన్ మాదిరిగానే ఉండటంతో చాలామంది షారుక్ కొడుకు అనుకున్నారు.
ఆర్యన్ ఖాన్ ప్రమేయం లేకుండానే మరో ఘనత..
కానీ.. కొన్ని నివేదికల ప్రకారం అతడు ఆర్యన్ ఖాన్ కాదని తేల్చేశారు. అక్కడ మూత్ర విసర్జన చేసిన వ్యక్తి కూడా సెలెబ్రిటీ కావడం విశేషం. 2012 లాస్ ఎంజెల్స్ ఎయిర్‌పోర్టులో బ్రాస్నన్ తాగిన మత్తులో ఉండి ఇలా చేస్తుండటంతో కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. ఆ వీడియోను ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ కు జోడిస్తున్నారు. అయితే అతడు ఆర్యన్ ఖాన్ కాదనేది తెలిసిపోయింది. ఇక ఆర్యన్ ఖాన్ విషయానికి వస్తే.. సినిమాలో ఎంట్రీ ఇవ్వకుండానే డ్రగ్స్ కేసులో ఇరుక్కొని పెద్ద సెలెబ్రిటీ హోదా పొందాడు. ఇటీవల.. 2021లో గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన రెండో సెలెబ్రిటీగా ఆర్యన్ ఖాన్ నివలవడం విశేషం.
































