Aryan Rajesh : ఆర్యన్ రాజేష్ పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ దివంగత దర్శకుడు సత్యనారాయణ కుమారుడిగా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైనటువంటి అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఒకానొక సమయంలో నటుడిగా మంచి గుర్తింపు పొందినటువంటి ఆర్యన్ రాజేష్ ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

ఈ విధంగా ఆర్యన్ రాజేష్ సినిమాలకు దూరం కావడానికి కారణం లేకపోలేదు. ఈయన వరుస సినిమాలలో నటిస్తూ వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు. ఇలా వరుస ఫెయిల్యూర్ తనని వెంటాడటంతో ఈయనకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో ఇండస్ట్రీకి కూడా ఈయన దూరమయ్యారు.అయితే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టువంటి ఆర్యన్ రాజేష్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్ రామ్ చరణ్ కు అన్నయ్య పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో హిట్ కాకపోవడంతో ఈయనకు పెద్దగా అవకాశాలు రాలేదు ఇలా అవకాశాలు రాకపోవడంతో ఆర్యన్ రాజేష్ ప్రొడక్షన్ రంగం వైపు అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది.అయితే ఈయన కెరియర్ ఇలా ఫెయిల్యూర్ కావడానికి కారణం తన తండ్రి ఈవీ సత్యనారాయణ కూడా ఒకరు కారణంగానే చెప్పాలి.

Aryan Rajesh : కథ ఎంపికలో తడబాటు…
ఇవివి సత్యనారాయణ గారు బ్రతికి ఉన్నప్పుడు ఈయన సినిమాలు ఎంతో మంచి హిట్ అయ్యేవి. ఇవివి గారు మరణించిన తర్వాత ఈయన సినిమాలు పూర్తిగా ఫెయిల్యూర్ అవుతూ వచ్చాయి .అయితే తన తండ్రి బ్రతికి ఉన్నప్పుడు కథల ఎంపిక విషయంలో తన తండ్రి సలహాలు సూచనలు తీసుకొని కథల ఎంపిక చేసుకునేవారు. తండ్రి మరణం తర్వాత ఈయన కథల ఎంపిక విషయంలో తడబడటం వల్లే ఇలా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారని చెప్పాలి.