Ashu Reddy: బుల్లితెర పై పలు కార్యక్రమాలలో, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మందికి సుపరిచితమైన వారిలో అషురెడ్డి ఒకరు. యూట్యూబ్ ఛానల్, బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అషురెడ్డి నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. నిత్యం పొట్టి దుస్తులు ధరించి ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.

ఈ విధంగా అషురెడ్డి తన ఫోటోలను షేర్ చేయడంతో కొన్నిసార్లు నెటిజన్ల ట్రోలింగ్ కి గురి అవుతుంటారు. ఈ క్రమంలోనే అషురెడ్డి తాజాగా తన మోకాలికి గాయం తగిలింది అంటూ ఒక ఫోటోని షేర్ చేస్తూ.. ఈ గాయం వల్ల నిలబడలేక పోతున్నాను.. నడవలేక పోతున్నాను అయినా ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది అంటూ చెప్పుకొచ్చారు.

ఒకవైపు తన మోకాలికి గాయం తగిలి బాధపడుతున్నప్పటికీ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో కొంతమంది నెటిజన్లు ఈమెపై నెగిటివ్ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఒక నెటిజెన్ స్పందిస్తూ…ప్రతి సారీ ఇది ఫ్యాషన్ అయిపోయింది.. దుబాయ్ రావడం…నైట్ హార్డ్‌వర్క్ చేయడం, వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని లక్షల్లో గిఫ్టులు బంగారం కొని తిరిగి మోకాలు నొప్పి అంటూ ఇలా చెప్పడం.. విశ్రాంతి తీసుకోవచ్చు కదా? కరువులో ఉన్నావా? లేక డబ్బు పిచ్చి పట్టిందా.. అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు…
ఆలోచించడానికి ఇంకా ఎదగాలి..
ఈ క్రమంలోనే సదరు నెటిజన్ కామెంట్ పై స్పందించిన
అషురెడ్డి… నీ చెత్త ఆలోచనలు చచ్చిపోవాలి.. నువ్వు బాగా ఆలోచించడానికి ఇంకా ఎదగాలి అంటూ సదరు కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినప్పటికీ ఈ ఫోటో గురించి వస్తున్న నెగిటివ్ కామెంట్లు మాత్రం ఆగడం లేదు. ఇలా ఈ ఫోటో ద్వారా అషురెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు































