Ashu Reddy: జూనియర్ సమంతగా పేరు సంపాదించుకొని సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ పొందిన ముద్దుగుమ్మ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకొని బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకున్న ఈమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.

ఈ క్రమంలోనే సంచలనాత్మక దర్శకుడు రాంగోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంతో ఫేమస్ అయిన అషు రెడ్డి వివిధ కార్యక్రమాల ద్వారా బిజీగా ఉండడమే కాకుండా ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలను కూడా దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా జూనియర్ సమంత గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఏకంగా సమంత చేసిన ఐటమ్ సాంగ్ కు స్టెప్పులు వేసింది.

పుష్ప సినిమాలో మొట్టమొదటిసారిగా సమంత ‘ఊ అంటావా మావా’ అనే ఐటమ్ సాంగ్ కు చిందులు వేసిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పాట మార్మోగిపోతోంది. ఈ క్రమంలోనే కొందరు ఈ పాటకు డాన్స్ వేస్తూ ఆ డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ పాటకు
అషు రెడ్డి కూడా డాన్స్ చేసింది.
సమంతను మించిపోయిన అషు రెడ్డి:
‘ఊ అంటావా మావా’ అనే ఐటమ్ సాంగ్ కు సమంతను మించిన బోల్డ్ అప్పీల్ తో అషుచేసిన ఈ డాన్స్ వీడియో ప్రోమోను ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రోమో వీడియో చూసిన అభిమానులు ప్రోమోనే ఇలా ఉంటే ఇక పూర్తి పాట ఏ విధంగా ఉంటుందో అని పూర్తి పాట కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.































