Ashu Reddy: బిగ్ బాస్ ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్లు అవుతున్నారు. అప్పటి వరకు కొంతమందికే తెలిసిన వ్యక్తుల ఒక్కసారిగా సెలబ్రెటీలు అవుతున్నారు. వరసగా సినిమా అవకాశాలు, టీవీ షోలు, రియాలిటీ షోలలో నటిస్తున్నారు.

ఇక బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో అందరి మతి పోగొడుతోంది. తన లెటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నెటిజెన్ల సెగలు పెట్టిస్తోంది. రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో మరింతగా ఫేమస్ అయింది.

ఇదిలా ఉంటే తన హాట్ ఫోటోలతో రచ్చచేస్తోంది అమ్మడు. ఇటీవల ఈ హాట్ బ్యూటీ పెట్టిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. వరసగా సినిమాలు, టీవీ షోలతో అవకాశాలు దక్కించుకుంటోంది. ఎప్పుడు తన అభిమానులకు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటోంది. వీలున్నప్పుడల్లా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ చాట్ కూడా చేస్తోంది.
దీంతో తలపట్టుకున్న అషు రెడ్డి..
తాజాగా ఇన్ స్టాలో తన అభిమానులతో ఇంటరాక్ట్ అయింది అషు రెడ్డి. ఇన్ స్టా స్టోరీస్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో పాల్గొంది. అయితే సెలబ్రెల ఫోన్ నెంబర్లు తెలుసుకోవాలని అభిమానులకు ఆసక్తి ఉంటుంది. అయితే ఈ సెషన్ జరుగుతున్న క్రమంలో ఓ అభిమాని అషురెడ్డికి తన నెంబర్ పంపించి… అక్కా నీతో మాట్లాడాలని ఉందంటూ కోరాడు. దీంతో తలపట్టుకున్న అషు రెడ్డి ఓ ఫోటో పెట్టింది. దీంతో ఆ నెంబర్ కూడా అందరికి కనిపించింది. ఇక దీంతో సదరు అభిమానికి తెగ ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారట. ఆ పోస్ట్ డిలీట్ చేయ్ అక్కా అని అతడు అషూ రెడ్డికి విజ్ఞప్తి చేశాడు. అయితే అషు రెడ్డి మాత్రం ఆ పోస్ట్ ను డిలీట్ చేయలేదు కదా.. ఇంకా సేవలను ఎంజాయ్ చేయి అంటూ పోస్ట్ పెట్టింది.































