Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న వారిలో అషు రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఈమె టిక్ టాక్ వీడియోలు డబ్ శ్మాష్ వీడియోల ద్వారా ఎంతో గుర్తింపు పొందారు. ఇకపోతే జూనియర్ సమంత అంటూ ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన పాపులారిటీ పెరిగింది. ఇలా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అషు రెడ్డి రెండుసార్లు బిగ్ బాస్ అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు.

ఇకపోతే బిగ్ బాస్ తర్వాత ఈ ముద్దుగుమ్మ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి ఫుల్ ఫాలోయింగ్ పెంచుకొని వరుస సినిమాలు టీవీ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అషు రెడ్డి నిత్యం తనకు సంబంధించిన బోల్డ్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా ఒక ఫోటో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటో వైరల్ అవుతుంది. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు అషు రెడ్డి ఏకంగా వీడియో కాల్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఈమె వీడియో కాల్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
మాట్లాడిన విషయాలను సస్పెన్స్ లో పెట్టిన అషు రెడ్డి..
ఈ పోస్ట్ చూసిన ఎంతో మంది నెటిజన్లు అషు రెడ్డి విజయ్ దేవరకొండకు ఎందుకు వీడియో కాల్ చేసింది? అసలు వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే విషయం గురించి చర్చలు జరుపుతున్నారు.ఇకపోతే ఈమె విజయ్ దేవరకొండతో వీడియో కాల్ మాట్లాడినట్టు మాత్రమే స్క్రీన్ షాట్ షేర్ చేశారు కానీ ఏం మాట్లాడారు అనే విషయం మాత్రం సస్పెన్స్ లో పెట్టారు.అయితే ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవడంతో విజయ్ దేవరకొండకు ఈమె వీడియో కాల్ చేయడం ఏంటి అంటూ చర్చలు జరుపుతున్నారు.































