దేశంలో మద్యం వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. గతంలో కేవలం పురుషులు మాత్రమే మద్యంపై ఆసక్తి చూపేవారు. అయితే మారుతున్న కాలంతో పాటే మద్యం తాగే మహిళల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. మరి దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువమంది మహిళలు మద్యం సేవిస్తున్నారు…? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఒక సర్వే నిర్వహించగా దేశంలో అసోం రాష్ట్ర మహిళలు మద్యం సేవించడంలో ముందు ఉన్నారని తేలింది.

15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 26.3 శాతం మంది ఉన్నారని తేలింది. 2019 – 20 డేటా ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈ సర్వే చేశారు. దేశవ్యాప్తంగా 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో మద్యం తాగే మహిళల శాతం 1.2గా ఉంది. మగవారి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా మద్యం సేవించే పురుషుల శాతం 35.6 శాతంగా ఉంది. వీరిలో 59 శాతం అసోంకు చెందిన వాళ్లే కావడం గమనార్హం.

దేశవ్యాప్త గణాంకాలతో పోల్చితే అసోం మహిళలు, పురుషులు మద్యం సేవించడంలో టాప్ లో ఉన్నారు. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా చాలామంది మద్యానికి బానిసలవుతున్నారు. మరోవైపు మద్యం తాగేవాళ్లలో చాలామంది కాలేయ సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారని మద్యం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు.

ఎవరైతే ఎక్కువగా మద్యం సేవిస్తారో వాళ్లు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ఫలితంగా ఆయుష్షు తగ్గిపోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. మద్యపానం వల్ల భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here