Astrologer Venu Swamy : 2024లో ఏపీ ఎన్నికలు సంచలనం రేపుతాయి… ఆ పార్టీనే కనబడకుండా పోతుంది…: ఆస్ట్రాలజర్ వేణు స్వామి

0
669

Astrologer Venu Swamy : జాతకాలను నమ్మే వారూ ఉంటారు, కొంతమంది అందంతా ట్రాష్ అంటూ తీసి పడేసేవారూ ఉంటారు. అయితే బాగా ఇబ్బందుల్లో ఉన్నపుడు ఎంత కస్టపడినా ఫలితం కనిపించినపుడు జాతకాల వైపు జనాలు మల్లుతారు. అలా వచ్చిన వారిని క్యాష్ చేసుకోవడం చాలా మంది జోతిష్యులు చేసే పని. అయితే కొంత మంది మాత్రం సెలబ్రిటీలు, రాజకీయనాయకుల జాతకాలను చెబుతూ వైరల్ అవుతుంటారు. అలాంటి వారిలో వేణు స్వామి అనే ఆస్ట్రాలజర్ ఒకరు. తనని తాను ప్రమోట్ చేసుకోడానికి సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి రాజకీయ నాయకుల జాతకాల గురించి మాట్లాడారు.

ఏపీ లో ఆ పార్టీ గల్లంతు…

వేణు స్వామి రాజకీయాల గురించి మాట్లాడుతూ మోడీ కి ఏమంత బాగోదంటూ చెప్పారు. వ్యక్తిగత జాతకం చెప్పాను కానీ మోడీకి అర్ధష్టమ శని నడుస్తోంది కాబట్టి అంత బాగా ఉండకపోవచ్చు, 2024లో అంటూ చెప్పాడు వేణు స్వామి. ఇక ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ 2024లో మళ్ళీ జగన్ దే అధికారం అంటూ చెప్పారు.

జగన్ కి 2024 లో అర్ధష్టమ శని వెళ్ళిపోతుందని, పవన్, చంద్రబాబు నాయుడులకు అర్ధష్టమ శని మొదలవుతుందని అందువల్ల వారిద్దరికీ రాజయోగం లేదంటూ చెప్పారు. ఒకవేళ టీడీపీ, బీజేపీ, జనసేన మూడు జంట కడితే జగన్ కు ఇబ్బందులంటూ చెప్పారు. ఇక 2024 ఎన్నికల సమయానికి సంచలనం రేగుతుందని, ఆంధ్రలో ఒక పార్టీ కనిపించకుండా కనుమరుగవుతుందంటూ చెప్పారు.