RRR Movie: సాధారణంగా మనం సినిమా థియేటర్ కు వెళ్లితే పూర్తి సినిమా చూడనిదే బయటికి రాము. అలాగే సినిమా చూస్తున్నంత సేపు ఏవైనా అంతరాయం కలిగితే ప్రేక్షకులు ఎంతో అసహనం వ్యక్తం చేశారు. అయితే స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే థియేటర్ యాజమాన్యం కూడా ఏ విధమైనటువంటి అంతరాయం కలగకుండా సినిమా రన్ అయ్యేలా చూసుకోవాలి.

ఇక ప్రపంచ వ్యాప్తంగా మూడు సంవత్సరాల నుంచి ఎంతో మంది సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా RRR.ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తున్నారు. అయితే ఒక థియేటర్లో ఈ సినిమా మొదటి హాఫ్ ప్రదర్శితం చేసి సెకండ్ హాఫ్ లేకుండా చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రేక్షకులు అసహనానికి లోనయ్యారు.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న సినీమార్క్ థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ సెకండ్ హాఫ్ లేకుండా ప్రదర్శితం చేయడంతో ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ అనుపమ చోప్రా ఎంతో అసహనానికి గురి అయినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ ప్రదర్శితమయ్యే సమయానికి సినిమా పూర్తయిందని థియేటర్ యాజమాన్యం చెప్పడంతో ఎంతో ఆశ్చర్యానికి గురయ్యానని ఈమె వెల్లడించారు.
సాంకేతిక లోపం కారణం…
ఇలా జరగడం మొదటిసారి.RRR మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు నార్త్ హాలీవుడ్ సినీమార్క్ థియేటర్ కి వెళ్లాను.అయితే పూర్తి సినిమా చూడకుండా సగం మాత్రమే చూశాను ఇదేంటి అని థియేటర్ మేనేజర్ ని ప్రశ్నించగా ఆ సినిమా ఇంకా ఉందని క్లారిటీ ఇవ్వలేదు. ఇలా సగం సినిమా మాత్రమే ప్రదర్శించడం వల్ల ఎంతోమంది అసహనానికి గురయ్యారు. పలు సాంకేతిక కారణాల వల్ల ఈ విధమైనటువంటి అంతరాయం ఏర్పడిందని, చివరికి ఎలాగోలాగ పూర్తి సినిమాను చూశానని అనుపమ చోప్రా మరో ట్వీట్ ద్వారా వెల్లడించారు.
First time this has happened! Went to @Cinemark North Hollywood #firstdayfirstshow of #RRR. Saw first half but not second because theatre had not ingested it. Manager said they didn’t receive instructions that there was more. Unbelievably frustrating! #Wanttoweep
— Anupama Chopra (@anupamachopra) March 25, 2022






























