రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్‌లో మోస్ట్ పాపులర్ టీమ్స్‌లో ఒకటి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలను నిజం చేస్తూ ఈసారి ఐపీఎల్ టైటిల్‌ను కొట్టేసింది. ఆర్‌సీబీ టీమ్, ఫ్యాన్స్ సంబరాలకు అంతే లేకుండా పోయింది. కానీ ఇప్పుడు వింటుంటే.. ఆర్‌సీబీ ఫ్రాంచైజీనే అమ్మేయడానికి రెడీ అవుతున్నారట! ఇది నిజంగా షాకింగ్ కదా? కొత్త ఓనర్ రాబోతున్నాడా ఏంటి?

ప్రస్తుత ఓనర్ డియాజియో.. జట్టును అమ్మేయడానికి ఆలోచిస్తున్నారట. పూర్తిగా అమ్మేస్తారో.. లేక కొంత షేర్ మాత్రమే అమ్ముతారో చూడాలి. దీని విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.16,384 కోట్లు అన్నమాట!
డియాజియో పీఎల్‌సీ వాళ్లు ఆర్‌సీబీలో కొంత వాటా లేదా పూర్తిగా అమ్మేయడానికి కొందరితో చర్చలు జరుపుతున్నారట. ఈ న్యూస్ బయటకు రాగానే యునైటెడ్ స్పిరిట్స్ షేర్ల ధరలు కూడా పెరిగాయి. ఒక్కసారిగా స్టాక్ ధర 3.3% పెరిగిందంటే చూడండి.. ఆర్‌సీబీకి ఎంత క్రేజ్ ఉందో!
అయితే.. ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని సమాచారం. దీని గురించి కంపెనీ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
గుర్తుండే ఉంటుంది.. 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు ఆర్‌సీబీ టీమ్‌ను విజయ్ మాల్యా కొన్నారు. ఆ తర్వాత ఆయన అప్పుల్లో కూరుకుపోవడంతో పరిస్థితి మారిపోయింది. అప్పుడు డియోజియో వాళ్లు స్పిరిట్స్ బిజినెస్‌ను కొనుగోలు చేసి ఆర్‌సీబీకి ఓనర్ అయ్యారు.
చూద్దాం ఏం జరుగుతుందో! ఆర్‌సీబీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.




























