Bahubali Movie: ఒక సినిమాని ఎంతో విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే సినిమా కోసం ప్రతి ఒక్క టెక్నీషియన్ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.కేవలం హీరో హీరోయిన్ తెరపై అందంగా చూపించడంతో సినిమా పూర్తి కాదు సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఎంతో స్పష్టంగా చూపించాలి.ఒక మనిషి నడుస్తున్న శబ్దం నుంచి పక్షి ఎగురుతూ వెళ్లే శబ్దం గాలి వీచే శబ్దం వరకు ఎంతో స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.

ఈ విధంగా అన్ని చర్యలు తీసుకున్నప్పుడే సినిమా ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే సినిమాకి మ్యూజిక్ డైలాగ్ ఎంత అవసరమో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే శబ్దాలు కూడా అంతే అవసరం. అయితే ఇలాంటి శబ్దాలు ఎవరు చేస్తారు వారిని ఏమంటారు అనే విషయానికి వస్తే.. ఇలాంటి బ్యాగ్రౌండ్ లో గాలివీయడం, డోర్ తీయడం, గుర్రం పరిగెడుతూ వచ్చే ఆ శబ్దాలన్నింటినీ చేసే వారిని ఫోలీ ఆర్టిస్టులు అంటారు.
ఈ పోలి ఆర్టిస్టులు సినిమాలో చిన్న చిన్న శబ్దాలను చేయటంలో ఎంతో నైపుణ్యం గలవారు. ఇలా పోలీ ఆర్టిస్టులుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు
కరణ్ అర్జున్ సింగ్. సినిమాలో వచ్చే షార్ట్స్ కి తగ్గ సౌండ్ అందించడం ప్రత్యేకత ముఖ్యంగా బాహుబలి సినిమాలో ఈయన కృషి ఎంతో ఉంది.చిన్న రాయి కింద పడే శబ్దం నుంచి మొదలుకొని గుర్రం పరిగెత్తడం ఇద్దరు వ్యక్తులు పరిగెడుతూ వెళ్లడం అలాగే పక్షి ఎగిరే శబ్దాన్ని కూడా ఎంతో స్పష్టంగా అందించారు.

Bahubali Movie: సహజ సిద్ధమైన శబ్దాలను చేయడంలో నేర్పరులు..
ఇలా బాహుబలి సినిమా కోసం ఈయన బ్యాక్గ్రౌండ్ శబ్దాలు ఎంతో అద్భుతంగా ఉండటం వల్లే ఈ సినిమాకి మరింత ప్లస్ పాయింట్ అయింది. అయితే వీరు స్టూడియోలోనే ఇలాంటి శబ్దాలు అన్నింటిని ఎంతో సహజసిద్ధంగా ఉండేలా రికార్డు చేస్తారు.ఇలాంటి శబ్దాలను చేయడానికి నిరుపయోగంగా ఉన్న వస్తువులను వీరు కొనుగోలు చేసి ఇలా ఎంతో అద్భుతంగా వాటిని ఉపయోగిస్తూ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రస్తుతం వీరు చేసే ఆ శబ్దాలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాహుబలి సినిమాలో బ్యాగ్రౌండ్ శబ్దాలు చేసింది వీళ్లే, ఈ ఆర్టిస్టుల టాలెంట్ చూశారా..#foleyartist #Tollywood #Baahubali pic.twitter.com/MdDxFP8ysT
— BBC News Telugu (@bbcnewstelugu) October 2, 2022

































