Balagam director Venu : కమెడియన్ గా సినిమాల్లో ప్రయాణం మొదలు పెట్టి నేడు తెలుగు ప్రేక్షకుల మనసు హత్తుకునేలా సినిమా తీసిన డైరెక్టర్ వేణు. కమెడియన్ వేణు నుండి డైరెక్టర్ వేణు గారు వరకు తన ప్రయాణం, తాను పడిన కష్టాలు, ఇబ్బందులు, త్యాగాలు అన్నింటినీ ‘బలగం’ సినిమా సక్సెస్ అయ్యాక అందరి ప్రశంసలతో మర్చిపోతున్నానంటూ ఇంటర్వ్యూలలో చెప్పిన వేణు ఎల్దండి తన బలగం సినిమా ప్రయాణం గురించి ఇంటర్వ్యూలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమాను ఎలా ఆదరిస్తున్నారు తనకు వస్తున్న వేలాది రివ్యూల గురించి ఇంటర్వ్యూలో తెలిపారు వేణు.

పల్లెల్లో అందరూ కలిసి సినిమా…
వేణు గారు బలగం సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ సినిమాకు మంచి పేరు వస్తుంది అనుకున్నాను కానీ మరీ ఇంత పెద్ధ హిట్ అవుతుంది అనుకోలేదు అంటూ ఆయన ఆనందాన్ని పంచుకున్నారు. సినిమాను చాలా పల్లెల్లో ప్రాజెక్టర్ పెట్టి అమెజాన్ ప్రైమ్ ద్వారా సినిమా పెట్టి ఊర్లో అందరూ కలిసి సినిమాచూస్తున్నారు. ఆ ఊరి సర్పంచ్ లు అలా సినిమాను వేయించి చూపిస్తున్నారు. అలా నాకు ఒక 50 వీడియోలు వచ్చాయి.

మా ఊర్లో బలగం సినిమా అందరం చూస్తున్నాం అని, అది ఆనందాన్ని ఇస్తున్నా ఒక్కొక్క కుటుంబం థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తే మాకు మేలు సినిమాకు డబ్బు వస్తుంది అంటూ తెలిపారు. అయితే సినిమాను పల్లెల్లో అందరూ కలిసి చూసినా చాలా మంది మళ్ళీ థియేటర్ కి పోయి చూస్తున్నారు అంటూ తెలిపారు. ఇక సినిమా చూసిన 80% మంది చివర్లో కన్నీళ్లు పెట్టుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది అంటూ వేణు తెలిపారు. అందరూ వారి కథను సినిమాలో చూసుకుంటున్నారు అంటూ తెలిపారు.































