Balakrishna: నందమూరి బాలకృష్ణ.. తెలుగు సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా పలు సేవా కార్యక్రమాలు, టీవీ షోలు, అప్పుడప్పుడు వివాదాస్ప వార్తల్లో హెడ్ లైన్ గా నిలుస్తూ.. తెలుగు వారందరికీ పరిచయస్తులు. బాలయ్య హోస్ట్ గా తాజాగా ఓటీటీ ప్లాట్ ఫాం అయిన ఆహాలో ‘అన్ స్టాపబుల్2’ మొదటి ఎపిసోడ్ విడుదల అవడం, అది భారీ హిట్ అవడం తెలిసిందే.

ఆహాలో విడుదలైన ‘అన్ స్టాపబుల్2’ మొదటి ఎపిసోడ్ కి గెస్టులుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ హాజరవడం, దానికి హోస్ట్ గా బాలయ్య ఉండటంతో సర్వత్రా ఆసక్తి రేగింది. ఈ షోలో రాజకీయ విషయాలు కూడా చర్చకు వస్తాయని, మరీ ముఖ్యంగా టీడీపీ పగ్గాలు మారడం మీద చర్చ జరుగుతుందని అంతా అనుకున్నారు.
అందరు ఊహించినట్లే.. చంద్రబాబు, బాలయ్యల మధ్య ఆ విషయం చర్చకు వచ్చింది. అయితే అప్పటి పరిస్థితుల్లో నందమూరి తారకరామారావు నుండి టీడీపీ పగ్గాలను చంద్రబాబు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని షోలో వివరించారు. అయితే దీనిపై లక్ష్మీపార్వతి స్పందిస్తూ.. బాలయ్య మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తీవ్రమైన కామెంట్లు కూడా చేశారు.
లక్ష్మీపార్వతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ.. వారు చేసిన తప్పులను కవర్ చేసుకునేందుకే ఈ టాక్ షోతో ప్రజల ముందుకు వచ్చారని ఎద్దేవా చేశారు. ‘ఛీ ఛీ బాలయ్యా.! అసలు నువ్వు ఎన్టీయార్ కొడుకువేనా.?’ అంటూ లక్ష్మీ పార్వతి తీవ్రస్థాయిలో కామెంట్ చేయడంతో పాటు.. అసలు టీడీపీలో గొడవలు రావడానికి కారణమే చంద్రబాబు నాయుడు అని వివరించారు.

Balakrishna:
ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు రెచ్చిపోయేలా చేసింది చంద్రబాబు నాయుడే అని, ఈ షో చూశాకా బాలయ్యపై ఎక్కడ లేని అసహ్యం వేస్తోందని లక్ష్మీ పార్వతి కామెంట్ చేశారు. తమ తప్పులను కప్పి పుచ్చుకోవడానికే ఈ షో చేశారంటూ లక్ష్మీ పార్వతి విరుచుకపడ్డారు. కాగా ఈ షో ఇప్పుడు తెలుగు నాట ట్రెండ్ అవుతుండటం తెలిసిందే.

































