నందమూరి బాలకృష్ణ అనగానే డైలాగ్స్ గుర్తుకువస్తాయి. అతడు చెప్పే డైలాగ్ డెలివరీ తెలుగు సినీ పరిశ్రమలోనే ఎవరికీ సాధ్యం కావు. అలా ఉంటాయి అతడి డైలాగ్స్. అయితే అతడు ఓ సంచలనాలకు తెర లేపుతున్నాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో అతడు మొదటి సారి వ్యాఖ్యతగా వ్యవహరించబోతున్నారు. అన్‌స్టాపబుల్ అనే షో కోసం బాలయ్య వ్యాఖ్యతగా అలరించబోతున్నారు.

ఈ షో నవంబంర్ 4 నుంచి ప్రసారం కానుంది. దీనికి సంబంధించి ఆహా ఓ ప్రోమో ద్వారా ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబుతో పాటు ఇంకెంతో మంది స్టార్ హీరోలను బాలయ్య ఇంటర్వ్యూ చేయనున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ షోకి సంబంధించిన కర్టెన్‌రైజర్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.
రాయి శిల్పంగా కావాలంటే.. ఉలి దెబ్బలు తినాలి.. ఆ తర్వాతనే దానికి రూపం వచ్చి ప్రతీ ఒక్కరూ అపురూపంగా చూస్తారు. ప్రతీ మనిషి జీవితంలో కూడా ఇలాంటి ఎత్తుపల్లాలు ఉంటాయని.. వాటిని అధిగమించి ముందుకు సాగాలన్నారు. ఈ షో కాన్సెప్ట్ నచ్చడంతో తాను ఒప్పుకున్నట్లు పేర్కొన్నాడు బాలయ్య. అల్లు రామలింగయ్య అంటే.. తన తల్లిదండ్రులకు ఎంతో అనుబంధం ఉందంటూ.. చెప్పుకొచ్చాడు.
ఈ కార్యక్రమానికి వచ్చే నటీనటులతో మాట్లాడి వాళ్ల భావోద్వేగాలను పంచుకుంటూ.. వాళ్లమాటలను మీ ముందు ఉంచుతానని బాలయ్య అన్నారు. ఇక అల్లు అరవింద్ మాట్లాడుతూ.. బాలయ్య సినిమాలో హీరో మాత్రమే కానీ.. నిజజీవితంలో కాదు అంటూ చెప్పాడు. ఏవి తనలో దాచుకోరని.. బాధ, ప్రేమ, ఏదైనా బయటకు చూపిస్తాడన్నారు. ఈ కాన్సెప్ట్ గురించి డిస్కషన్ చేస్తున్న సమయంలో బాలయ్య చేస్తే ఎలా ఉంటుందని మా సభ్యులతో చెప్పినప్పుడు.. చాలామంది ఓకె చేశారని.. వెంటనే బాలయ్యకు ఫోన్ చేయగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఒప్పుకున్నట్లు చెప్పాడు.
































