Balakrishna: హీరో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ నటించిన కార్తికేయ 2 సినిమా హిందీలో కూడా విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇప్పటికే ఈ సినిమా హిందీలో దాదాపు మూడు కోట్లకు చేరువలో కలెక్షన్లను రాబడుతుందని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా కృష్ణుడు ద్వారక నేపథ్యంలో తెరకెక్కడంతో బాలీవుడ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుందని తెలుస్తోంది.మొత్తానికి ఊహించని విధంగా ఈ సినిమా ఇటు సౌత్ లోనూ అటు నార్త్ లోను మంచి విజయాలను అందుకుందని చెప్పాలి.

ఇదిలా ఉండగా ఈ సినిమా హిందీలో కూడా మంచి ఆదరణ సంపాదించుకోవడంతో బాలకృష్ణ అభిమానులు కాస్త హర్ట్ అయినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ నటించిన అఖండ సినిమా తెలుగులో ఎలాంటి విజయమందుకుందో మనకు తెలిసిందే. కార్తికేయ2 సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేసినప్పుడు బాలకృష్ణ సినిమా ఎందుకు విడుదల చేయలేదని బాధపడుతున్నారు.
ఇకపోతే ఈ సినిమా హిందీలో డబ్ చేసి విడుదల చేయకపోవడానికి ఓ కారణము ఉందని తెలుస్తోంది. బాలకృష్ణ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైంది అప్పటికి ఇంకా థియేటర్లు పూర్తిస్థాయిలో రన్ కాలేదు. కోవిడ్ నేపథ్యంలో నార్త్ ఇండస్ట్రీలో థియేటర్లో పూర్తిగా మూసివేసి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేయలేకపోయారని తెలుస్తోంది.

Balakrishna: పూర్తిస్థాయి థియేటర్లు రన్ కాలేదు..
ఒకవేళ హిందీలో డబ్ చేసినప్పటికీ భారీ బిజినెస్ చేసి వసూళ్లను రాబట్టలేకపోతుందన్న ఉద్దేశంతోనే ఈ సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేయలేదు. అందుకే ఈ సినిమాని హిందీలో విడుదల చేయలేకపోయారు. ఒకవేళ ఈ సినిమాని కనుక హిందీలో విడుదల చేసి ఉంటే అక్కడ కూడా వసూళ్ల సునామీ సృష్టించేదని చెప్పాలి. ఇక అఖండ తర్వాత బాలయ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.






























