Balakrishna: తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది.నందమూరి తారక రామారావు కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయాలలో కూడా తన సత్తా ఏంటో నిరూపించారు. ఇలా నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలను తీర్చి రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా దేశ రాజకీయాలలోను సంచలనం సృష్టించారు.

ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన ఓ గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఈయన వారసులని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక రాజకీయపరంగా ఎన్టీఆర్ కుటుంబానికి వైసీపీ ప్రభుత్వానికి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది.అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ గారిని ఎంతగానో అభిమానిస్తారు. అందుకు కారణం ఆయన చేసిన మంచి సేవలు అని చెప్పాలి.

ఇకపోతే దివంగత నేత మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి కూడా ఎంతోమంది ఎంతో గొప్పగా తెలియజేశారు. అయితే కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు వైసిపి ప్రభుత్వం నందమూరి కుటుంబం పై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ ఈ విమర్శలపై నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ఏ మాత్రం స్పందించలేదని ఒకానొక సమయంలో ఆయన పై తీవ్రత స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఎన్టీఆర్ యూనివర్సిటీ విషయంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఓ గొప్ప వ్యక్తి అని చెప్పడంతో చాలామంది ఎన్టీఆర్ పై నోరు పారేసుకుని తన పై విమర్శలు చేశారు.

బాలకృష్ణను ప్రశ్నించే దమ్ము లేదా…
ఇకపోతే తాజాగా నందమూరి నటసింహం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన వైయస్సార్ వ్యక్తిత్వం గురించి ఎంతో గొప్పగా చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.ఈ క్రమంలోనే కొందరు ఎన్టీఆర్ అభిమానులు ఒకప్పుడు ఎన్టీఆర్ వైయస్సార్ గొప్పవారు అంటే ఆయనని తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు ఇప్పుడు అదే మాట బాలకృష్ణ అంటున్నారు.మరి ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యలు తప్పు కాదా ఎన్టీఆర్ విషయంలో లేచిన నోర్లు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాయి బాలకృష్ణని ఎదిరించే దమ్ము లేదా అంటూ కొందరు ఈ వ్యవహారంపై టిడిపి నేతలను ప్రశ్నిస్తున్నారు.































