Balakrishna: సాధారణంగా బాలయ్య సినిమా అంటేనే ప్రేక్షకులు పంచ్ డైలాగులు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే సినిమాలలో బాలకృష్ణ చెప్పే పంచ్ డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని ఎప్పటికీ ట్రెండింగ్ లో ఉంటాయి. ఇక ఇటీవల వీర సింహారెడ్డి సినిమాలో కూడా బాలయ్య చెప్పిన డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇటీవల జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక బాలయ్య బాబు అభిమానులు థియేటర్స్ లో చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో ఆకట్టుకునే కథనంతో పాటు పాటలు, పంచ్ డైలాగులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య బాబు చెప్పిన డైలాగులు పొలిటికల్ ఆంధ్రప్రదేశ్ అధికారపక్ష నాయకులను ఉద్దేశిస్తూ ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇలా సినిమాల ద్వారా బాలకృష్ణ అధికారపక్షం గురించి పరోక్షంగా సెటైర్ లు వేసినట్టు ప్రేక్షకులు భావిస్తున్నారు. అంతేకాకుండా బాలయ్య చెప్పిన ఈ పొలిటికల్ డైలాగులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ ఈ పొలిటికల్ డైలాగుల గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ మాట్లాడుతూ.. “సినిమాలకు మనుషులకు చాలా దగ్గర బంధం ఉంటుందని వెల్లడించాడు. ప్రజల నిజజీవితంలో జరిగే విషయాలను సినిమాలలో చూపిస్తామని” బాలయ్య చెప్పుకొచ్చాడు.

Balakrishna: రాజకీయ చర్చలకు కారణమైన వీర సింహారెడ్డి డైలాగ్స్…
ఈ సినిమాలో మాత్రం నిజంగానే జరిగిన విషయాల గురించి బాలయ్య ఇలా డైలాగులు చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన రోజు నుండి ఈ పొలిటికల్ డైలాగుల గురించి చర్చ జరుగుతుంది. ఇక ఈ డైలాగుల గురించి ఆంధ్రప్రదేశ్ అధికారపక్ష నాయకులకు కూడా స్పందిస్తున్నారు.































