నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాని పూర్తి చేసిన తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.

ఇందులో బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ మరొక దర్శకుడికి ఓకే చెప్పినట్లు సమాచారం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ మరో మల్టీస్టారర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలుస్తుంది. అయితే అనిల్ రావిపూడి సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
కొరటాల శివ చెప్పిన కథ బాలకృష్ణకు నచ్చడంతో ఆలోచించకుండా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మరి ఇందులో బాలకృష్ణతో పాటు నటించే మరొక హీరో ఎవరనే విషయాన్ని కూడా తెలియజేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే బాలకృష్ణకు సంబంధించిన ఈ మల్టీస్టారర్ చిత్రం గురించి త్వరలోనే అధికారకంగా వెల్లడించనున్నట్లు సమాచారం.































