Balakrishana: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా విజయవంతం కావడం, అలాగే స్మాల్ స్క్రీన్ పై తన టాక్ షో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఫుల్ జోష్ లో ఉన్నారని చెప్పవచ్చు. ఇకపోతే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న బాలకృష్ణ తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా అఖండ సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి అఖండ చిత్రబృందం కూడా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు బాలకృష్ణ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. అలాగే కొందరు రిపోర్టర్స్ ఏపీ టిక్కెట్ల రేట్లపై బాలయ్యను ప్రశ్నించగా ఈ వ్యవహారంపై బాలకృష్ణ మొట్టమొదటిసారిగా స్పందించారు.

ఇప్పటివరకు ఏపీ టికెట్ల వ్యవహారం పై పలువురు హీరోలు, కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రస్థాయిలో వివాదాన్ని రేకెత్తించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై ఒక్కసారి కూడా స్పందించని బాలకృష్ణ మొట్టమొదటిసారిగా టికెట్ల వ్యవహారంపై స్పందించారు.
Balakrishna : నా ఒక్కడి నిర్ణయం కాదు…
ఈ క్రమంలో రిపోర్టర్ ‘వైఎస్ జగన్ మీ అభిమాని కదా.. ఆయనతో మాట్లాడొచ్చు కదా.. మాట్లాడి టికెట్ల విషయం తెల్చొచ్చు కదా..’ అంటూ అడిగారు ఈ నేపధ్యంలో బాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల రేట్లను తగ్గించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై నేనొక్కడినే అభిప్రాయం తీసుకోవడం కాదు ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే ఇండస్ట్రీకి చెందిన హీరోలు, ప్రొడ్యూసర్లు, ఫిలించాంబర్ మెంబర్స్, అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని చర్చలు జరిపిన అనంతరం మన సమస్యలను తెలుసుకొని వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చి ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని ఇది ఏ ఒక్కరి అభిప్రాయం కాదని తెలిపారు. చలన చిత్ర పరిశ్రమ అంటే ప్రభుత్వానికి మంచి ఆదాయం తెచ్చి పరిశ్రమ కనుక ఈ వ్యవహారంపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.































