బుల్లితెరపై ప్రసారమైన చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకుల మదిలో మెదులుతుంది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో బామ్మ పాత్రలో నటించిన సురేఖా సిక్రీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సీరియల్లో బామ్మ తన మనవడికి సపోర్ట్ చేస్తూ ఎప్పుడు ఆనంది పై కోప్పడే పాత్రలో మనకు కనిపిస్తారు.

ఈ విధంగా చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా ఎంతోమందిని ఆకట్టుకున్న సురేఖా సిక్రీ తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా 75 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగానే సురేఖా సిక్రీ ముంబైలో తుది శ్వాస విడిచారు.సురేఖా సిక్రీ కేవలం సీరియల్ లో మాత్రమే కాకుండా హిందీ సినిమాల్లో కూడా నటించి అందరి చేత ప్రశంసలు పొందారు.
సురేఖా సిక్రీ 2018 సంవత్సరంలో హిందీ చిత్రం “బధాయ్ హో” అమ్మమ్మ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి అందరి చేత ప్రశంసలు పొందారు. ఈ చిత్రంలో నటించినందుకు గాను ఈమెకు ఉత్తమ సహాయనటిగా జాతీయ చిత్ర అవార్డును దక్కించుకున్నారు. ఇక చివరి సారిగా సురేఖా సిక్రీ జోయా అక్తర్ దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్ “ఘోస్ట్ స్టోరీస్” లో చివరిసారిగా సందడి చేశారు. అనారోగ్యం కారణంగా ఇతర సినిమాలు సీరియల్స్ లో నటించని సిక్రీ నేడు కన్నుమూశారు. ఈమె మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు.































