బండ్ల గణేష్ తెలుగు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అలాగే కామెడీయన్ గా, నటుడి గా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత చిన్న చిన్నగా సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా సెటిల్ అయిపోయారు. ఇక ఈయన నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో పలు విషయాలపై స్పందిస్తూ ఉంటారు.ఇక ఈయన పవన్ కళ్యాణ్ కి ఎంత వీరాభిమాని అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

బండ్ల గణేష్ ఒకసారి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని తరచూ అందరినీ షాక్ కు గురి చేస్తూ ఉంటారు. ఇక తాజాగా బండ్ల గణేష్ ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు. కొత్తగా ఒక బయోపిక్ ప్రకటించాడు. స్వామి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు.ఇదే విషయాన్ని బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆ స్వామీజీ ఎవరో కాదు గణపతి సచ్చిదానంద స్వామినే.
శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు నన్ను వారి జీవిత చరిత్ర తీయమని ఆదేశించినందుకు నాకు చాలా గర్వముగా ఉన్నది… ఇది నా అదృష్టం… నేను ఒక మహా యజ్ఞం లాగా భక్తుల ముందు ఉంచుతాను…???????????? pic.twitter.com/NeiEBGsRaC
— BANDLA GANESH. (@ganeshbandla) October 23, 2021
ఈ గణపతి సచ్చిదానంద స్వామి జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించబోతున్నట్లు వెల్లడించారు. అప్పాజీ జీవిత చరిత్ర నేనే తీసి తీరుతా, ఆయన పాదాల సాక్షిగా నాకు అనుమతి ఇచ్చారు. మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు నన్ను వారి జీవిత చరిత్రను తీయమని ఆదేశించి నందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఇది నా అదృష్టం. ఈ సినిమాను ఒక మహా యజ్ఞం లాగ భక్తులు ముందు ఉంచుతానని బండ్ల గణేష్ తెలిపారు.
అప్పాజీ జీవిత చరిత్ర నేనే చేసి తీరుతా… అయన పాదాల సాక్షిగా నాకు అనుమతించారు…ఎవరి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు..???? pic.twitter.com/JqqY06pvTt
— BANDLA GANESH. (@ganeshbandla) October 24, 2021
స్వామీజీ గారు తానుగా వివరించిన ఆయన జన్మ రహస్యం ఇంకా ఎన్నో అంటూ మైసూరులో స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదములు తీసుకుంటున్న ఫోటోని పంచుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బండ్లగణేష్ చేసిన ట్వీట్స్ అలాగే అందుకు సంబంధించిన ఫోటోలు మొదలవుతున్నాయి. బండ్ల గణేష్ నటుడిగా రీఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నాడు.































