కమెడియన్ గా తన కెరియర్ ను మొదలు పెట్టి.. ప్రస్తుతం బడా నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు బండ్ల గణేష్. అయితే అతడు ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటున్నాడు. ట్రెండింగ్ లో తన పేరు కూడా ఉండే విధంగా చూసుకుంటున్నాడు. అది వ్యక్తిగత విషయాలపరంగా అయినా, వివాదాస్పద వ్యాఖ్యలతోనైనా, సినిమా విశేషాలపరంగానైనా సరే బండ్ల గణేష్ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు.

మొన్నటి వరకు మా ఎన్నికలల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తర్వాత వెంటనే జీవిత రాజశేఖర్ మీద సెటైర్లు వేయడం.. జనరల్ సెక్రటరీ పదవికి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగుతాను అంటూ చేసిన వ్యాఖ్యలతో బండ్ల గణేష్ క్రియేట్ చేసిన వేడి అంతా ఇంతా కాదు. అయితే తాజాగా బండ్ల గణేష్ అందరికీ షాకిచ్చారు. ‘డేగల బాబ్జీ’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… స్వాతి చంద్ర నిర్మిస్తున్న చిత్రంతో ఆయన హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.
ఆ చిత్రానికి డేగాల బాబ్జీ గా టైటిల్ ఖరారు చేశారు. శుక్రవారం హరీశ్ శంకర్ టైటిల్ పోస్టర్ ఆవిష్కరించారు. తమిళంలో హిట్టైన సినిమాను తెలుగులో బండ్ల గణేష్‌ను హీరోగా పెట్టి రీమేక్ చేస్తున్నారు. అదే సినిమాను హిందీలో అభిషేక్ బచ్చన్‌ను హీరోగా పెట్టి తీయబోతోన్నారనే వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం పవర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్లతో ఈ ఫస్ట్ లుక్ వైరల్ అవుతోంది.
Thanks to my blockbuster director @harish2you for releasing for DEGALA BABJI .it’s a wonderful experience in my acting career.thanks to my director venkat chandra.???? pic.twitter.com/8icbcVXnzM
— BANDLA GANESH. (@ganeshbandla) September 17, 2021
పోస్టర్ రిలీజ్ అనంతరం.. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. బండ్ల గణేశ్ ఫస్ట్‌లుక్, టైటిల్‌కు అద్భుత స్పందన లభిస్తోందని అన్నారు.. సినిమా సైతం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని.. ఈ సినిమాను అతి త్వరలో షూటింగ్ ఫినీష్ చేసేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.































