Bandla Ganesh: ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ చేసే సినిమాల కన్నా ఈయన సోషల్ మీడియా వేదికగా చేసే ట్వీట్లు ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. గత రెండు రోజులుగా గురూజీ అంటూ పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలిచిన బండ్ల గణేష్ తాజాగా ఒక వెబ్ సైట్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ వరుస ట్వీట్లు చేస్తూ సదరు వెబ్ సైట్ కు తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు.

తెర వెనక అంతా ఓకేనా బండ్ల గణేశా అంటూ ఒక వెబ్సైట్ బండ్ల గణేష్ గురించి ఒక ఆర్టికల్ రాశారు. ఈ క్రమంలోని ఈయన దీనిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సదరు వెబ్సైట్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అరే వెంకట్ రెడ్డి ఓ పెద్ద బ్రోకర్ మీ మూర్తి చిన్న బ్రోకర్ నీలి వార్తలు రాసుకుని నీలి బతుకులు బతుకుతూ దొంగచాటుగా తిరిగే నీకు మా గురించి ఎందుకురా లఫూట్ అంటూ ఘాటుగా ప్రశ్నించాడు.
మేము ప్రేమిస్తే ప్రాణం ఇస్తాం, పూజిస్తాం, అలాగే అలుగుతాం. ప్రేమించినప్పుడు ప్రాణమిచ్చి పూజించిన వారికి అలిగే హక్కు కూడా ఉంటుంది. బండ్ల గణేష్ సినిమా వాళ్ళ వార్తలు లేకపోతే నీకు పబ్బం గడవదు. నువ్వు నిజంగా మనిషివి అయితే నీకు సిగ్గు శరం ఉంటే కడుపుకు అన్నం తింటూ ఉన్నట్లయితే నీలి వార్తలు రాసుకొని బ్రతికే నువ్వు మీ ఇంట్లో లేనప్పుడు జరుగుతున్న నీలి చిత్రాల గురించి ఆలోచించు. నిజాయితీగల వాడితో దూరంగా ఉండడానికి ప్రయత్నించు నీతిగా బ్రతికే వాడి జోలికి అసలు రాకు మాడి మాస్తేయిపోతావు అంటూ కామెంట్ చేశారు.

Bandla Ganesh: ఇలాంటి వారికి ఇంటర్వ్యూలు ఇవ్వకండి…
ఇలా సదరు వెబ్సైట్ అధినేత పై తీవ్ర స్థాయిలో మండిపడటమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా ఇలాంటి వారిని దూరం పెట్టాలని ఇలాంటి వారికి ఎవరు కూడా ఇంటర్వ్యూలో ఇవ్వకూడదు అంటూ ఈ సందర్భంగా బండ్ల గణేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏది ఏమైనా సదరు వెబ్సైట్ గురించి బండ్ల గణేష్ ఇలా వరుసగా ట్వీట్లు చేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మరి బండ్ల గణేష్ వ్యాఖ్యలపై సదరు వెబ్సైట్ ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.































