Bandla Ganesh: సినీ నటుడుగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో వివాదాస్పద ట్వీట్ల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా చేసే ట్విట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఈయన వరుస ట్వీట్స్ చేయడం అందరిని ఆలోచనలలోకి పడేసింది.

ఇండస్ట్రీలో నిర్మాత కావాలి అంటే గురూజీకి భారీ గిఫ్ట్ ఇస్తే చాలు నిర్మాత అయిపోతారు అంటూ ఈయన కామెంట్ చేశారు. అలాగే భార్యాభర్తలను విడగొట్టాలన్న తండ్రి కొడుకులను విడగొట్టాలన్న, గురు శిష్యులను విడగొట్టాలన్న గురూజీకే సాధ్యమవుతుంది అంటూ బండ్ల గణేష్ చేసినటువంటి ట్వీట్ వైరల్ అయ్యాయి. ఇలా బండ్ల గణేష్ వరుసగాటు ట్వీట్స్ చేయడంతో ఈయన పరోక్షంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను టార్గెట్ చేసే ట్వీట్ చేస్తున్నారని అర్థమవుతుంది.
గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ కు మధ్య దూరం రావడానికి పరోక్షంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణమని తెలుస్తుంది. అందుకే ఈయన తరచూ పరోక్షంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఇలాంటి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈయన చేసిన ట్వీట్ వైరల్ కావడంతో కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణంగానే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ఇద్దరు విడిపోయారా అదే విషయాన్ని బండ్ల గణేష్ చెబుతున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Bandla Ganesh: పవన్ రేణు దేశాయ్ విడిపోవడానికి త్రివిక్రమ్ కారణమా….
ఇక ఎంతోమంది పవన్ కళ్యాణ్ కు చాలా సన్నిహితంగా ఉండేవారు ఇలా పవన్ కళ్యాణ్ కు సన్నిహితంగా ఉన్న వారందరూ కూడా ఒక్కొక్కరు తనకు దూరమవుతూ వస్తున్నారు కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే తనతో పర్మినెంట్గా సన్నిహితంగా ఉంటున్నారని అయితే వీరందరూ దూరం కావడానికి త్రివిక్రమ్ కారణమంటూ పరోక్షంగా బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.