Director Kalyan Krishna: 2016 సంవత్సరంలో సోగ్గాడే చిన్నినాయన చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఆ తర్వాత నాగచైతన్య రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా రారండోయ్ వేడుక చూద్దాం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా ఈ సినిమా కూడా మంచి విజయం అందుకోవడం తో ఆ తర్వాత నేల టికెట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది తిరిగి నాగార్జున నాగచైతన్య ప్రధాన పాత్రలో సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ చిత్రం బంగార్రాజు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

బంగార్రాజు చిత్రం ద్వారా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఏకంగా బాలీవుడ్ నిర్మాణ సంస్థతో పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నారు.ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కే ఈ జ్ఞానవేల్ రాజా స్టూడియోగ్రీన్ అనే బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో తెలుగు తమిళ చిత్రాలు నిర్మించడమే కాకుండా ఎన్నో చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు.
భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేసిన నిర్మాతలు..
ఈ నేపథ్యంలోనే జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమాని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఏమిటి? ఇందులో నటీనటులు ఎవరు? అనే విషయాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బంగార్రాజు చిత్రం ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా మంచి అవకాశాలను కూడా అందుకున్నట్లు తెలుస్తోంది.































