దేశంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత పలు స్కీమ్ లకు సంబంధించిన నగదు బ్యాంక్ అకౌంట్లలో జమవుతూ ఉండటంతో దేశంలో బ్యాంక్ ఖాతాలు ఉన్నవారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే ఇదే సమయంలో టెక్నాలజీ వినియోగం పెరగడంతో సైబర్ మోసాలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. చాలామంది బ్యాంక్ అకౌంట్లు ఉన్నవాళ్లు కొన్ని సందర్భాల్లో వాళ్ల తప్పేం లేకపోయినా బ్యాంక్ ఖాతాలో డబ్బులు కట్ కావడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు.

అయితే ఖాతాదారుడి ప్రమేయం లేకుండా డబ్బులు కట్ అయితే అందుకు బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ లేదా క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి మోసాలకు పాల్పడితే బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసే బ్యాంకులే ఆ నగదుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. గతంలో జాతీయ వినియోగదారుల కమిషన్ ఈ మేరకు ఒక కేసులో తీర్పు ఇచ్చింది.
జాతీయ వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం రెండేళ్ల క్రితం కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకింగ్ వ్యవస్థ లోపాలు లేదా బ్యాంక్ నుంచి పొరపాటు వల్ల ఖాతాలో నగదు కట్ అయితే బ్యాంకులే ఆ నగదుకు బాధ్యత వహిస్తాయని ఆర్బీఐ వెల్లడించింది. కస్టమర్ తప్పు వల్ల డబ్బులు పోతే మాత్రం కస్టమర్ పోయిన డబ్బుకు బాధ్యత వహించాలి.
బ్యాంక్ తప్పు లేకుండా, కస్టమర్ తప్పు లేకుండా నగదు కట్ అయితే బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు వీలైనంత త్వరగా ఫిర్యాదు చేస్తే కొంత మొత్తం పొందే అవకాశం ఉంది. జాతీయ వినియోగదారుల కమిషన్, ఆర్బీఐ బ్యాంకింగ్ లోపాల వల్ల ఖాతాదారుల విషయంలో జరిగే మోసాలకు బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది.





























