Health: ఈ లక్షణాల కారణంగా..! కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి..! ఏంటంటే..?

0
478

Health: మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇటీవల కాలంలో ఆహార అలవాట్లు, వర్క్ ప్రెషర్, దురలవాట్ల కారణంగా కిడ్నీ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. జీవ క్రియలు గతి తప్పినప్పుడు కిడ్నీలు ఎఫెక్ట్ అవుతున్నాయి.

Health: ఈ లక్షణాల కారణంగా..! కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి..! ఏంటంటే..?
Health: ఈ లక్షణాల కారణంగా..! కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి..! ఏంటంటే..?

ముఖ్యంగా మూత్రంలో మంట, శరీరం పొడిబారటం, కడుపునొప్పి, నడుంనొప్పి, శరీరం దురదలు వస్తుండటం, కాళ్లు, చేతులు వాపులకు గురవ్వడం వంటి లక్షణాలు కనిపించినప్పడు కిడ్నీ సంబంధింత వ్యాధులు ఎటాక్ అవుతున్నాయని ప్రజలు గుర్తించాలి. 

Health: ఈ లక్షణాల కారణంగా..! కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి..! ఏంటంటే..?
Health: ఈ లక్షణాల కారణంగా..! కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి..! ఏంటంటే..?

విటమిన్లు, ఖనిజాల లోపం వల్ల ఒక్కోసారి కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. దీంతో పాటు అతిగా మద్యం సేవించడం వల్ల, ధూమపానం వల్ల కిడ్నీల ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి. చాలా వరకు కిడ్నీ ఫెయిల్యూర్స్ వ్యాధులు మనకు తెలియకుండానే కొన్ని ఏళ్లుగా వస్తుంటాయి. చాలా మంది వీటిని చివరి స్టేజ్ లో గుర్తించడం వల్ల సరైన వైద్యం అందించినా… ఫలితం లేకుండా పోతోంది. 

ఉబకాయం తగ్గించుకోవడం వంటి మంచి అలవాట్లను..

సరైన నిద్ర రోజుకు ఏడు నుంచి 8 గంటల నిద్ర ఉండాలి. ఇలా లేకపోతే దీర్ఘాకాలంలో కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బీపీ, షుగర్ వ్యాధి ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. బీపీ, షుగర్ లెవల్స్ ఉన్నవారు కిడ్నీల పనితీరును ఎప్పటికప్పుడు నిశితంగా పరీక్షించుకోవాలి. దీంతో పాటు అనవసర ఒత్తిడి మూలంగా కూడా కిడ్నీల పనితీరుపై ప్రభావం పడుతోంది. సరైన వ్యాయామం వల్ల, ఫ్యాటీ ఫుడ్, ఉబకాయం తగ్గించుకోవడం వంటి మంచి అలవాట్లను పాటించడంతో పాటు రోజుకు అవసరమైన నీటిని తీసుకోవడం వల్ల కిడ్నీల పనితీరును క్రమబద్ధీకరించుకోవచ్చు.