Bellamkonda Sai Srinivas: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు వారసుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అయితే ఇప్పటివరకు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సినిమాలో ఒక్కటి కూడా మంచి హిట్ అందుకోలేకపోయాయి. దీంతో సరైన హిట్టు కోసం బెల్లంకొండ శ్రీనివాస్ ఎదురు చూస్తున్నాడు. అయితే ప్రస్తుతం తెలుగులో విడుదలైన ఛత్రపతి సినిమా హిందీలో రీమేక్ చేస్తున్నారు.

వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ లో ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాతో అయినా హిట్టు కొట్టి బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని బెల్లంకొండ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ మీడియా మీద మండిపడ్డారు. తన గురించి తప్పుడు వార్తలు రాసినందుకు అసహనం వ్యక్తం చేస్తూ .. కలిసి కనిపిస్తే చాలు రాసేస్తారా.. అంటూ ఫుల్ ఫైర్ అవుతున్నాడు. అసలు విషయం ఏమిటంటే…
ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ రష్మిక జంటగా కెమెరా కంటికి చిక్కారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బెల్లంకొండ శ్రీనివాస్ ని రష్మిక తో రిలేషన్ గురించి ప్రశ్నించగా.. బెల్లంకొండ శ్రీనివాస్ స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశాడు.”ఇద్దరు కలిసి జంటగా కనిపిస్తే చాలు మీకు తోచినట్టు రాసేస్తార అంటూ మండి పడ్డాడు. రష్మిక తో తన రిలేషన్ గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని అవన్నీ ఒట్టి పుకార్లేనని క్లారిటీ.

Bellamkonda Sai Srinivas: నిజాలు తెలుసుకోకుండా ఎలా రాస్తారు…
ఒకరి గురించి నిజానిజాలు పూర్తిగా తెలుసుకోకుండా ఎలా రాయగలుగుతారు అంటూ మండి పడ్డారు. సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్ళినప్పుడు అనుకోకుండా ఎయిర్పోర్టులో కలిస్తే మాట్లాడుకుంటామని తెలిపాడు. అలా ఇద్దరం కలిసిన సందర్భాలు కూడా తక్కువే అని చెప్పుకొచ్చాడు. ఇలా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటేనే ప్రేమించుకుంటున్నట్లా..అంటూ ప్రశ్నించాడు. మొత్తానికి రష్మికతో రిలేషన్ గురించి తనపై వస్తున్న వార్తలకు బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చాడు.































