టాలివుడ్ లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి చిత్రాన్ని హిందీలో రిమేక్ చేస్తున్నారు. ఇప్పటికే బెల్లంకొండ సురేశ్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఆ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

ఈ సినిమాతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ మరో టాలీవుడ్ సూపర్ హిట్ రీమేక్‌ను బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. అందేంటంటే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మరో బ్లాక్ బాస్టర్ సినిమా ఆది. దీనిని కూడా హిందీలో రిమేక్ చేసి అందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేయనున్నట్లు సమాచారం.
అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు బాలీవుడ్‌లో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ మూవీని హిందీలో వినాయక్ దర్శకత్వంలో బాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ బాలివుడ్ ఎంట్రీ తర్వాత బెల్లంకొండ ప్యాన్ ఇండియా హీరో కావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆది సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమా హక్కులు ఆయన దగ్గరే ఉన్నాయి. అందుకే ఇపుడు ఈ సినిమాను హిందీలో వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడని టాలివుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది.































