కరోనా మహమ్మారి కారణంగా ప్రతీ ఒక్కరు ఎంతో కొంత ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. ఎక్కువగా రోగనిరోధక శక్తిని పెంచే పండ్లను, డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటున్నారు. వాటిని అంతక ముందు చాలా తక్కువ మంది తీసుకునే వారు. ఇప్పడు ప్రతీ ఒక్కరు తీసుకోక తప్పడం లేదు. దీనితో ఇప్పుడు పండ్లకి మంచి డిమాండ్ ఏర్పడింది. అందులో ఎక్కువగా జమపండుకు గిరాకీ బాగా పెరిగిపోయింది. జామ పండులో ఎక్కువగా విటమిన్ సీ ఉంటుంది.

ఇది పండ్ల చిగుళ్లకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే జామపండ్లు మాత్రమే కాదు జామ ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. జామ ఆకులతో టీ కూడా తయారు చేయవచ్చు. పండ్ల ఆకుల రసం తాగితే బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
జుట్టు పెరుగుదల, పొడవు, అందాన్ని పెంచడానికి జుట్టు మీద జామ ఆకుల నీటిని కూడా ఉపయోగించవచ్చు. శుభ్రమైన నీటిలో ఆకులను కడిగి.. ఒక పాత్రలో ఒక లీటరు నీళ్లతో వాటిని తీసుకొని రెండు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత నీటిని చల్లార్చి .. వాటిని మరో గిన్నెలో తీసుకొని కలర్ బ్రష్ సహాయంతో మూలాల నుండి జుట్టు చివరల వరకు అప్లై చేయండి.
తర్వాత చేతులతో తలను ఐదు నిమిషాలు మసాజ్ చేస్తే.. జుట్టు రాలిపోయే సమస్య తగ్గిపోతుంది. అంతే కాకుండా ఉల్లిపాయలతో కూడా తీసుకోవచ్చు. అదెలా అంటే.. జామ ఆకులను, ఉల్లిపాయలను పేస్ట్ చేసి జుట్టుకు పట్టించి ఐదు నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత స్నానం చేసేటప్పుడు షాంప్ తో శుభ్రంగా చేయాలి. తర్వాత రెండు మూడు రోజులకు ఫలితం మనకు కనపడుతుంది.



























