సాధారణంగా మనం ప్రతిరోజు మన ఇంట్లో దీపారాధన చేస్తుంటాము. అయితే ఈ దీపారాధన చేయడానికి కొంతమంది మట్టి ప్రమిదలను ఉపయోగిస్తారు. మరికొంతమంది కంచు, ఇత్తడితో తయారు చేసిన ప్రమిదలను వెలిగించి దీపారాధన చేస్తుంటారు. ఆర్థికంగా ఎంతో స్తోమత కలిగిన వారు దేవుని ముందు దీపారాధన చేయడానికి వెండి ప్రమిదలను వెలిగిస్తారు. ఇలా ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు దీపాలను వెలిగించి దేవుడికి పూజ చేస్తుంటారు. అయితే వెండి దీపాలను ఏ దేవుడి ముందు వెలిగించాలో తెలుసా? ఈ విధంగా వెండి దీపాలను వెలిగించడం ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

వెండి ప్రమిదలో నెయ్యిని వేసి వినాయకుడు ముందు దీపారాధన చేయటం వల్ల మనం చేసే పనులలో ఏ ఆటంకం లేకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా వెండి ప్రమిదలో నెయ్యిని వేసి సరస్వతి దేవి ముందు వెలిగించడం ద్వారా జ్ఞానం ప్రసాదిస్తుంది. వెండి ప్రమిదలలో నెయ్యిని వేసి శుక్రవారం లక్ష్మీదేవి ముందు వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

మంగళవారం కుజగ్రహం ముందు వెండి దీపాలు వెలిగించడం ద్వారా కుజ గ్రహ దోష నివారణ జరుగుతుంది. మంచి బుద్ధి కలగాలంటే బుధవారం బుధ గ్రహం ముందు నెయ్యి వేసి వెండి దీపాలను వెలిగించాలి. అదేవిధంగా శనివారం వెండి ప్రమిదలో నువ్వుల నూనెను వేసి దీపాలు వెలిగించడం ద్వారా ఏలినాటి శని ప్రభావం తొలిగిపోయి శని దోష నివారణ జరుగుతుంది. ఈ విధంగా వెండి దీపాలను వెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here