Bhanu Sree Mehra: సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు అవకాశాలు అందుకోవాలని అవమానాలు, కష్టాలతో పాటు కమిట్మెంట్ సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అన్నింటిని దాటుకొని ఇండస్ట్రీలో అవకాశాలు అందుకున్న కూడా కొన్ని సంవత్సరాలు మాత్రమే వారికి అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఎక్కువగా ఇలా జరుగుతూ ఉంటుంది.

ఇండస్ట్రీలో 60, 70 సంవత్సరాలు దాటిన వారు కూడా హీరోలుగా నటిస్తున్నారు. కానీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు నాలుగైదు సంవత్సరాల కన్నా ఎక్కువ విలువ ఉండదు. తాజాగా ఈ విషయం గురించి అల్లు అర్జున్ హీరోయిన్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. వరుడు సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించిన హీరోయిన్ భానుశ్రీ మెహ్రా. ఈ సినిమా ప్లాప్ అవడంతో ఈమెకు హీరోయిన్ గా సరైన గుర్తింపు లభించలేదు. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలలో నటించినప్పటికీ నటిగా గుర్తింపు సంపాదించలేకపోయింది.
సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడుతూ హీరోయిన్లకు వయసే పెద్ద సమస్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మనవళ్లు మనవరాలు ఉన్నా కూడా హీరోగా అవకాశాలు వస్తున్నాయి. కానీ హీరోయిన్స్ విషయానికి వస్తే వయసు పెరిగినా, పెళ్లి జరిగినా హీరోయిన్స్ ఛాన్సులు దక్కటం లేదు అంటూ తన బాధ బయటపెట్టింది.

Bhanu Sree Mehra: తల్లి పాత్రలకు మాత్రమే అడుగుతారు…
హీరోలు ఎంత వయసొచ్చినా లవ్ స్టోరీ సినిమాలలో వారి వయసులో సగం కూడా లేని హీరోయిన్లకు ప్రేమికుడిగా నటిస్తారు. కానీ ఐదారేండ్లు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ వివాహమైతే చాలు హీరోయిన్స్ గా కాకుండా తల్లి పాత్రలకు మాత్రమే అడుగుతుంటారు. ఇది చాలా బాధాకరం. ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ఈ వ్యత్యాసం ఉండకూడదు. పెళ్ళి తరువాత కూడా హీరోయిన్స్ కీలక పాత్రలలో నటించే సినిమాలు తెరకెక్కాలి’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
































