నితిన్ “భీష్మ” ట్విట్టర్ రివ్యూ : నాన్ స్టాప్ నవ్వులే నవ్వులు…! నితిన్ హిట్ అందుకున్నట్టేనా?

0
2066

నితిన్, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం “భీష్మ” మహా శివరాత్రి కానుకగా ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొంత కాలంగా సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నితిన్.. మరో పక్క ఫుల్ కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ అభిమానులు… మరి నితిన్ తాజా చిత్రం “భీష్మ” అటు అభిమానులు ఇటు నితిన్ ల దాహం తీర్చిందా?? అవుననే అంటున్నారు. నితిన్ గట్టిగానే హిట్ కొట్టాడట. “ఛలో” సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై విమర్శకుల ప్రసంశలు అందుకుని తన సత్తా చాటుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి డైరెక్టర్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇదివరకే రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా హీరో నితిన్, హీరోయిన్ రష్మిక తో కలిపి ఈ చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. ఇప్పటికే యూ ఎస్ లో ప్రీమియర్ షోలు చూసేసారు అక్కడి ప్రేక్షకులు. ఈ చిత్రం చుసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలూ వెల్లడిస్తున్నారు. సినిమా చాలా బాగుందని , కామెడీ అయితే చింపేసాడని ట్వీట్ చేస్తున్నారు.

ఫస్టాఫ్ గురించి చెబుతూ.. భీష్మ బొమ్మ అదిరిందట. ఫస్టాఫ్ మొత్తం కామెడీ ట్రాక్ నడిచిందట. “గుండెజారి గల్లంతయిందే” సినిమా తరువాత నితిన్ ఆ రేంజ్ కామెడీ చేయడం ఇదే అంటున్నారు. ఇంటర్వెల్ లో అద్భుతమైన ట్విస్ట్ కూడా ఉంటుందట. అవుట్ అండ్ అవుట్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడని. బోర్ అనే ఫీల్ లేకుండా సరదా సరదాగా సాగిపోయే సన్నివేశాలతో దర్శకుడు ఫస్టాఫ్ నడిపించాడట. చాలా రోజుల తరువాత నితిన్ కు కరెక్ట్ రోల్ దొరికిందని అంటున్నారు. తన క్యారెక్టర్ తో నితిన్ అదరకొట్టేసాడని అంటున్నారు.

ఇక సెకెండ్ హాఫ్ అసలు కథలో కి ప్రవేస్తారట. కొంచెం లాగ్ అనిపించినా దాన్ని కామెడీతో, కమర్షియల్ స్టఫ్ తో కవర్ చేసారని తెలుస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా అదిరిపోయిందని. మంచి ఎంటర్టైనింగ్ మూవీ అని ట్వీట్లు చేస్తున్నారు. వెన్నెల కిశోర్ కామెడీ సినిమాకి హైలైట్ అంటున్నారు. ఇక హీరోయిన్ రష్మిక కూడా తన పాత్రకి తగిన న్యాయం చేసిందని, డైరెక్టర్ వెంకీ కుడుముల సింగల్ లైన్ డైలాగ్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. “అక్కకి లేక అడుక్కుతింటుంటే.. చెల్లి వచ్చి చికెన్ కావాలందట” ఇలాంటి డైలాగ్స్ థియేటర్లో అరుపులు పుట్టించాడట.

భీష్మ సినిమా కొన్ని గత సినిమాలను గుర్తు చేసినా కూడా డైరెక్టర్ వెంకీ కుడుముల తనదైన శైలిలో కామెడీ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ గుప్పించి చూసే ప్రేక్షకులకు ఎక్కడా బోర్ అనిపించకుండా చేసాడని టాక్. స్టోరీ లైన్ కాస్త వీక్ అని అనిపించినా… అది పెద్దగా సినిమా ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులు అది మర్చిపోయేలా ఉందని అంటున్నారు. మొత్తానికి “భీష్మ” సినిమాతో డైరెక్టర్ గా వెంకీ కుడుముల, హీరోగా నితిన్ హిట్ కొట్టారని అంటున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది. నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చి పెట్టె సినిమా అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here