Bhumika: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన భూమిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందిన భూమిక తెలుగుతోపాటు తమిళ్ , హిందీ భాషలలో కూడా ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది.

ఇక ప్రస్తుతం భూమిక తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అక్క వదిన వంటి పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భూమిక వ్యక్తిగత విషయాలతో పాటు ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ మరణం తనని ఎంతో బాధించిందని ఆ బాధనుండి బయటపడటానికి చాలా కాలం పట్టిందని తెలిపింది.
సుశాంత్ రాజ్ పుత్ నటించిన ధోని సినిమాలో సుశాంత్ కి అక్క పాత్రలో భూమిక నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. అయితే సుశాంత్ అలా ఆత్మహత్య చేసుకుని మరణించటంతో ఆమె షాక్ కి గురైనట్లు తెలిపింది. మొదట సుశాంత్ మరణం గురించి తాను నమ్మలేదని, అయితే ఆ తర్వాత సుశాంత్ మరణించిన వార్త తెలియటంతో చాలాకాలం ఆ బాధ నుండి బయటపడలేకపోయాను అని తెలిపింది.

Bhumika: చివరి చూపుకు నోచుకోలేదు…
సుశాంత్ మరణించిన సమయంలో కోవిడ్ వల్ల తాను ముంబై కి దూరంగా ఉండటంతో సుశాంత్ ని చివరి చూపు కూడా చూడలేదని తెలిపింది. ఇప్పటికే సుశాంత్ మరణించాడు అంటు నమ్మలేకపోతున్నాను అంటూ భూమిక చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం భూమిక బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లో సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

































