ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి గురించి వైసిపి నాయకులు అవమానకరంగా మాట్లాడటంతో సభ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బోరున విలపించారు. ఈ క్రమంలోనే ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా సంచలనంగా మారింది. ఇకపోతే ఈ ఘటన అనంతరం నందమూరి హీరోలు ఈ ఘటనపై ఘాటుగా విమర్శలు చేశారు.

ఇదిలా ఉండగా ఈ విషయం గురించి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి స్పందించలేదు. ఈ క్రమంలోనే ఈమె ఈ విషయం గురించి స్పందించారు. తాజాగా భువనేశ్వరి ఈ విషయంపై మాట్లాడుతూ టీవీలో తన భర్త చంద్రబాబునాయుడు ఏడవడం చూసి ఆమె ఇంట్లో ఏడ్చారని సమాచారం. మీడియా సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు లోకేష్ ఇంటికి రావడంతో వారిని చూసి ఈమె మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ ఘటన అనంతరం బయటపడిన భువనేశ్వరి చంద్రబాబు నాయుడుకి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. జరిగిన విషయాన్ని మనసులో నుంచి తుది చేయమని ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకని చెప్పారు. దిగజారిన మనుషులు ఎలాంటి మాటలైనా మాట్లాడతారు అలాంటివి మనసులో పెట్టుకోకూడదని భువనేశ్వరి చంద్రబాబు నాయుడుకు ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.
రాజకీయాలలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఈ విధమైనటువంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి ఉంటుంది గతంలో నాన్న గారి హయాంలో కూడా ఇలాంటి వారు ఎన్నో మాటలతో మనసును ఎంతో ఇబ్బంది పెట్టారని, ఇలాంటి వాటిని పట్టించుకోకుండా వాటిని పక్కనపెట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్లాలని ఈమె సూచించినట్లు తెలుస్తోంది.

































