కరోనా మూలాలు తేల్చాలి ఇంటిలిజెన్స్ కు జో బైడేన్ ఆదేశం.. చైనా అభ్యంతరం..!

0
210

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మూలాలపై మూడు నెలల్లో తేల్చాని అమెరికా ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. చైనాలో మొదలైన ఈ వైరస్ జంతువులనుంచి వచ్చిందా ? లేక ల్యాబ్ నుంచి వచ్చిందా అనే విషయంపై 90 రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని అమెరికా ఇంటలిజెన్స్ ఏజెన్సీకి సూచించారు జో బైడెన్. ఈ విషయంపై అనేక కధనాలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో మరోసారి దర్యాప్తుకు ఆదేశించారు. ఈ మేరకు అమెరికా నేషనల్ ల్యాబోరేటరీస్ కు విజ్ఞప్తి చేసారు. ఇందులో భాగంగా ఈ కరోనా మూలాలు కనుక్కునేందుకు చైనా కలిసిరావాలని కోరారు.

కొవిడ్ -19 మూలాలపై దర్యాప్తును చైనా ఇప్పటికీ అడ్డుకుంటుందని ఆరోపించారు. అంతర్జాతీయ పరిశోధనలకు చైనా ప్రభుత్వ సహకారం లేనందున అసలు నిజాలు ఎప్పటికీ తెలియకపోవచ్చని అన్నారు. అయితే దర్యాప్తు సంస్థలు సమాచార ప్రయత్నాలను రెట్టింపు చేయాలని, విశ్లేషణాత్మక వివరాలను సేకరించాలని సూచించారు. ఈ క్రమంలో ఖచ్చితమైన నిర్ధారణతో తమకు 90 రోజుల్లోనివేదిక ఇవ్వాలని ఇంటిలిజెన్స్‌ను బైడెన్‌ ఆదేశించారు.

కరోనా మూలాలు కనుగొనాలని జో బైడేన్ అమెరికా ఇంటెలిజెన్స్‌ ను ఆదేశించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది చైనా. రాజకీయ ఉద్దేశ్యాలతోనే ఇలాంటి దర్యాప్తు జరుపుతున్నారని. ఇటువంటి చర్యలు దర్యాప్తుకు ఆటంకం కలగడంతో పాటూ కరోనా కట్టడిలో అవరోధాలను సృష్టిస్తాయని తెలిపింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబారి ఒక ప్రకటన విడుదల చేసారు. అయితే రెండో దశ దర్యాప్తుకు WHO సిద్దమవుతున్న నేపధ్యంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న చైనాకు ఇప్పుడు ఈ జో బైడేన్ చేసిన ఆదేశాలు మింగుడుపడటం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here