Big Boss OTT : ప్రస్తుతం ఎక్కడ చూసినా బిగ్ బాస్ గురించే చర్చ జరుగుతోంది. మే 21న గ్రాండ్ ఫినాలే ఉండటంతో ఎవరు విన్నర్ అవుతారు ఎవరు రన్నర్ అవుతారని విన్నర్ కి ఎంత మొత్తంలో ప్రైజ్ మనీ ఇస్తారు అనే దానిపై అనేక వార్తలు వచ్చాయి.. ఇక ఈ ఊహాగానాలకు తెరపడింది. నిన్న జరిగిన గ్రాండ్ ఫినాలే లో విజేతగా నిలిచింది ఆడపులి బిందు మాధవి. ఈ క్రమంలోనే ఆమె గురించి సోషల్ మీడియా లో వెతకడం మొదలు పెట్టారు.

బిందు మాధవి కి సపోర్ట్ చేసిన రమ్యకృష్ణ….
అయితే ఇటీవల రమ్యకృష్ణ బిందు మాధవి ని సపోర్ట్ చేస్తూ ఒక వీడియో చేసింది. దీంతో అందరి చూపు ఇప్పుడు వీరిద్దరి మధ్య రిలేషన్ ఎంటా అన్నదానిపై పడింది. కొంత మంది వీరిద్దరూ బంధువులు అవుతారేమో అన్న అనుమానలు కూడా వ్యక్తపరుస్తున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే రమ్య కృష్ణ, బిందుమాధవి మంచి స్నేహితులు. బిందు మాధవి తెలుగు అమ్మాయి అయినప్పటికీ టాలీవుడ్లో అవకాశాలు లేక ఈ అమ్మడు చెన్నై చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కోలీవుడ్ లో వర్క్ లో ఉన్న సమయంలోనే రమ్యకృష్ణ, బిందు మాధవి కి మంచి స్నేహం కుదిరిందట.

ఈ స్నేహం తోటే రమ్యకృష్ణ బిందు మాధవి ని సపోర్ట్ చేస్తూ వీడియో చేసింది. బిందు మాధవి లాంటి ఆడపులి బిగ్ బాస్ హౌస్ లో ఉంటే ఎంతో సంతోషంగా ఉంది అని ఈ వీడియోలో రమ్యకృష్ణ తెలియజేశారు. నా సపోర్ట్ బిందుమాధవి కే మీరు కూడా భిన్న మాధవికి ఓటు వేసి బిగ్ బాస్ విన్నర్ గెలిపించండి అంటూ వీడియో విడుదల చేసింది. మొత్తానికి బిందు మాధవి బిగ్ బాస్ ఒటిటి తెలుగు విన్నర్ గా నిలిచిన మొట్టమొదటి మహిళగా రికార్డ్ సృష్టించింది.































