బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళం భాషలలో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్ లు విజయవంతంగా పూర్తి చేసుకొని, ఇటీవలే ఐదవ సీజన్ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఐదవ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకుంది. అలాగే ఏడుగురు కంటెస్టెంట్ లు కూడా ఎలిమినేట్ అయ్యారు.

అయితే గత సీజన్స్‌కు రెస్పాన్స్ అదిరిపోయిన 5వ సీజన్ మాత్రం ప్రేక్షకులను అంతగా నచ్చడం లేదనేది ముందు నుంచి వినిపిస్తున్న వాదన. ఇందుకు గల కారణం ఈసారి హౌస్‌లో అంతగా ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్ రాకపోవడమే.అలాగే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదా అనే సందేహాలు కూడా వ్యకమయ్యాయి. ఇదిలా ఉంటే షో ఆరంభంలో ప్రేక్షకులు అంతగా ఆదరించకపోయిన వారాలు గడుస్తున్న కొద్ది ఆట రసవత్తరంగా మారిపోయింది.
ఈ షో మొదటీ మూడు వారాలు షో కొంచం బోరింగ్ గా సాగిన నాలుగో వారం నుంచి కంటెస్టెంట్స్ ఆట తీరులో మార్పు వచ్చింది. ఇకపోతే ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో జనాలకు తెలిసిన కంటెస్టెంట్స్ అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు.వారిలో యాంకర్ రవి యూట్యూబర్ షణ్ముఖ్, సిరి, ప్రియా, సన్నీ, ఉమాదేవి, శ్రీరామ్,విశ్వ, మానస్, లోబో, నటరాజ్ మాస్టర్, కాజల్‌లకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండేది. ఇక లహరి, శ్వేత, హమిదా, సరయు, అంతకు ముందు జనాలకు అంతగా తెలియదు.
ఇక ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారు ? టాప్ 5 లో ఎవరెవరుంటారు ? అనే దానిపై నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి విన్నర్ అయ్యేందుకు సన్నీకి,మానస్ మధ్య గట్టి పోటీ ఉండబోతుందని నెట్టింట్లో టాక్ నడుస్తోంది. వీరిద్దరిలో ఒకరు విన్నర్ కావడం మరోకరు రన్నర్ అప్ గా నిలవబోతున్నారంటూ లెక్కలు వేస్తున్నారు నెటిజన్స్. అలాగే టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్‌లో యూట్యూబర్ షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, మానస్, సన్నీ ఉండనున్నట్లుగా నెటిజన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.































