ప్రస్తుతం తెలుగు రియాల్టీ షోలలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 బాగా పాపులర్ అవుతోంది. బిగ్ బాస్ ప్రారంభమైనప్పుడు నార్మల్ గానే కనిపించిన షో, ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ షోలోని కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అంతకంతకు హౌజ్ హీటెక్కుతోంది.

బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పుడు ఏంజరుగుతుందోనని అందరిలో ఉత్కంఠ రేగుతోంది. ఇక ఈ బిగ్ బాస్ షో 19 మంది కంటెస్టెంట్లతో మొదలైతే, ఐదుగురు ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం ఈ షోలో 14 మంది ఉన్నారు. బిగ్‌బాస్ ఏ టాస్క్ ఇచ్చినా కంటెస్టెంట్స్ అంతా పోటాపోటీగా పెర్మామెన్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ టైటిల్ గెలిచి తీరాలన్న లక్ష్యంతో అందరు కసిగా ఆడుతున్నారు. ఆరో వారంలో బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ బాస్ బొమ్మల ఫ్యాక్టరీలో టాస్క్ లో.. బిగ్ బాస్ నియమాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన రవి, లోబో, శ్వేతను కెప్టెన్సీ కంటెంన్సీకి అనర్హులుగా ప్రకటించారు.
వారితో పాటు సంచాలకులుగా వ్యవహరించిన కాజల్, సిరిలను కూడా అనర్హులుగా బిగ్ బాస్ ప్రకటించాడు. ఇక మానస్, సన్నీ, ప్రియా, విశ్వా మరియు యానీ మధ్య కెప్టెన్సీ టాస్క్ నడవడంతో అందులో విశ్వా గెలిచి కెప్టెన్ గా నిలిచాడు. అయితే విశ్వా కెప్టెన్ కావడం రెండోసారి. ఇదంతా ఇలా ఉండగా.. ఇక రాత్రిపూట మానస్ గురించి మీటింగ్ పెట్టారు అమ్మాయిలు.
మానస్ బాగుంటాని సిరి కామెంట్ చేయగా.. నీకు అన్నయ్య అవుతాడు అంటూ ప్రియాంక చెబుతుంది. తనను నేను ఎప్పుడు అన్నయ్య అని పిలవలేదు అని సిరి చెబుతుంది. ‘నీ దిష్టే తగులుతుందే, ఏం కళ్లే అవి..’ అంటూ పింకీ చిర్రుబుర్రులాడింది. ఇలా మానస్ అక్కడ నిద్ర పోతున్న సమయంలో కాజల్, ప్రియా, ప్రియాంక, సిరి పొగడ్తలతో మొంచెతుత్తారు.































