Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ తెలుగు కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా ముగిసింది.ఇక ఈ కార్యక్రమంలో విన్నర్ గా రేవంత్ నిలబడతారని ముందుగా ఊహించినట్టే ఆయన ట్రోఫీ అందుకున్నారు. శ్రీహాన్ రేవంత్ ఇద్దరూ ఉండగా నాగార్జున 40 లక్షల ఆఫర్ చేయడంతో శ్రీహన్ గోల్డెన్ బ్రీప్ కేస్ అందుకొని 40 లక్షలు సొంతం చేసుకోగా రేవంత్ మాత్రం ట్రోఫీ ముఖ్యమని తాను ట్రోఫీ అందుకొని విజేతగా నిలబడ్డారు.

ఈ విధంగా బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం విజేతగా రేవంత్ కప్పు అందుకోగా రన్నర్ గా నిలిచిన శ్రీహాన్ మాత్రం 40 లక్షల క్యాష్ అందుకున్నారు. అయితే ప్రతి సీజన్లోనూ ఇదే కదా జరిగేది అనుకుంటే పొరపాటే కానీ ఈ సీజన్లో మాత్రం నాగార్జున అందరికీ చివరిలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.40 లక్షల అందుకున్న శ్రీహన్ కప్పు అందుకున్న రేవంత్ ఇద్దరూ కూడా ఈ సీజన్ విజేతలని ప్రకటించారు.
ఇలా వీరిద్దరికి ప్రైజ్ మనీ ట్రోఫీ అందించిన తర్వాత నాగార్జున మాట్లాడుతూ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 28 బిగ్ బాస్ సీజన్లు జరగగా ఏ సీజన్లోనూ జరగని విధంగా బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారిగా తెలుగు సీజన్ సిక్స్ కార్యక్రమంలో ఇద్దరు విజేతలుగా నిలిచారు.ఇక వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయనే విషయం చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది కనుక ఓటింగ్ ప్రకారం శ్రీహాన్ విజేతగా నిలిచారని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీహాన్ ఎమోషనల్ అవుతూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

Bigg Boss6: ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉన్న శ్రీహాన్..
ఒకవేళ శ్రీహాన్ 40 లక్షల బ్రీఫ్ కేస్ తీసుకోకపోయి ఉంటే తప్పనిసరిగా కప్పు శ్రీహాన్ అందుకునేవారని అయితే ఆయన బ్రీఫ్ కేస్ తీసుకొని రేవంత్ ట్రోఫీ తీసుకోవడంతో ఈ సీజన్లో ఇద్దరు విజేతలుగా నిలిచారని చెప్పాలి. మొత్తానికి ఈ సీజన్ లో ఇద్దరూ విజేతలుగా నిలవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.































