Bigg Boss 7: బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇవ్వనున్న ప్రముఖ డాన్స్ మాస్టర్ కపుల్స్!

0
59

Bigg Boss 7: తెలుగు బుల్లితెరపై త్వరలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రసారం కాబోతోంది.ఈ కార్యక్రమం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేశారని తెలుస్తుంది. ఇక ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. ఇలా ఈ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కూడా ఎప్పటిలాగే కపుల్స్ వెళ్లబోతున్నారనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే ఆ జంట ఎవరు అంటూ అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే అమర్ తేజు పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా మరో కపుల్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.

ప్రముఖ డాన్స్ మాస్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఆట సందీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యకాలంలో ఈయన తన భార్య జ్యోతితో కలిసి పెద్ద ఎత్తున డాన్స్ రీల్స్ చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. ఇలా తమ డాన్స్ పెర్ఫార్మెన్స్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఆట సందీప్ మాస్టర్ అలాగే జ్యోతి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని సమాచారం.

Bigg Boss 7: సందీప్ మాస్టర్..జ్యోతి

ఇలా వీరిద్దరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారంటూ ఓ వార్త సంచలనంగా మారింది.ప్రస్తుతం ఈ జంట స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి నీతోనే డాన్స్ అనే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ఈ జోడి బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా కూడా హాజరు కాబోతున్నారనే విషయం వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.