Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి అనంతరం సెలబ్రెటీగా బయటకు వచ్చారు.ఈయన బిగ్ బాస్ హౌస్ లో ఆట తీరు చూసి ఎంతో మంది ఈయనకు అభిమానులకు మారిపోయి చివరికి విన్నర్ గా తనని గెలిపించారు. ఇలా విన్నర్ గా బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ బయట మాత్రం సెలబ్రిటీ హోదా అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు వచ్చే ప్రైజ్ మనీ మొత్తం పేద రైతులకు అందిస్తానని చెప్పారు కానీ ఇన్ని రోజులపాటు ఈ పని చేయకుండా ఉండడంతో మాట తప్పారని అందరు కామెంట్ చేశారు కానీ ఇటీవల ఈయన ఒక కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఏడాదికి సరిపడా బియ్యం బస్తాలను అందించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
అయితే ఇంకా తన వద్ద డబ్బు ఉంది తన టీం మొత్తం పేద రైతులను పరిశీలించి వారి గురించి అన్ని తెలుసుకునే వారికే డబ్బు అందజేస్తారని పల్లవి ప్రశాంత్ తెలిపారు అందుకు సంబంధించిన వీడియోలను కూడా మీకు తెలియజేస్తానని తెలిపారు. ఇక ఈయన పేదల రైతులకు సహాయం చేస్తానని చెప్పడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది తాము పేద రైతులను తమకు సహాయం చేయండి అంటూ తన ఇంటికి క్యూ కట్టారట.
డబ్బు కోసం రావద్దు..
ఇలా పెద్ద ఎత్తున రైతులు సహాయం కావాలి అంటూ తన ఇంటికి రావడంతో ఈయన వారందరిని ఒకటే వేడుకున్నారు డబ్బు సహాయం చేయమని దయచేసి ఎవరూ మా ఇంటికి రావద్దు అమ్మ నాన్నలను విసిగించవద్దు. ఎవరు పేదవారు అనే విషయాలను మేమే తెలుసుకొని స్వయంగా వారి దగ్గరకు మేమే డబ్బు తీసుకువస్తామని అంతవరకు ఎవరు మా ఇంటికి రావద్దు అంటూ ఈయన చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.































