Pallavi prashanth: బిగ్ బాస్ కార్యక్రమంలో విన్నర్ గా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తర్వాత ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్టార్ మా వాళ్ళు నా సామిరంగా అనే స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. నాగార్జున సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా ఈ కార్యక్రమంలో నాగార్జున కూడా సందడి చేశారు.

ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్లు కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శివాజీ పట్ల పల్లవి ప్రశాంత్ మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు. నేను బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నాను అంటే అందుకు కారణం మా అన్న శివాజీ ప్రోత్సాహమే అంటూ ప్రశాంత్ మాట్లాడారు. నాకు నిజజీవితంలో అన్న లేరు కానీ నా ప్రాణం పోయేవరకు శివాజీ అన్ననే నా అన్న అంటూ శివాజీ గురించి గొప్పగా చెప్పారు.
శివాజీకి పట్టు బట్టలు..
అనంతరం పల్లవి ప్రశాంత్ శివాజీ కోసం పట్టుబట్టలను సమర్పించగా యావర్ కూడా శివాజీకి బంగారు కడియం తొడిగించి మీరే నా బ్రదర్ మదర్ అండ్ ఫాదర్ అంటూ శివాజీ గురించి గొప్పగా చెప్పారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమంలో పల్లవి ప్రశాంత్ రైతు కష్టాలను తెలియజేస్తూ ఒక పెర్ఫార్మెన్స్ చేశారు. ఈయన చేసినటువంటి ఈ పెర్ఫార్మెన్స్ అందరికీ కన్నీళ్లను తెప్పించింది.
https://www.instagram.com/reel/C17DI24hZqE/?utm_source=ig_web_copy_link































