Bigg Boss Divi: దేశంలో నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. ఇలా గుర్తింపు పొందిన బిగ్ బాస్ కంటెస్టెంట్లలో దివి కూడా ఒకరు. బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు పొందిన దివి సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంటుంది.

ఇలా సినిమాలలో నటిస్తూ తన నటనతో వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ నెటిజన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. దివి అందాలు చూసి కుర్రాళ్ళు కూడా ఫిదా అయిపోతున్నారు.
ఈ క్రమంలో తాజాగా అలనాటి అందాల తార సిల్క్ స్మితని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలలో సిల్క్ స్మిత ఎలా తయారై కైపెక్కించే చూపులతో కుర్ర కారు మనసుల్ని దోచుకుంటుంది. 80, 90 దశకాల్లో కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సిల్క్ స్మిత హీరోయిన్ల కన్నా ఎక్కువ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కానీ చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది. సిల్క్ స్మితకు ఏ మాత్రం తీసిపోకుండా తన అందాలు ఆరబోస్తూ.. కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది దివి. సిల్క్ స్మితని మరిపించేలా తన చూపుల బాణాలు విసురుతు యువకులకు మళ్లీ అలాంటి చూపులతో, అలాంటి చీరకట్టుతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది .

Bigg Boss Divi: సిల్క్ స్మితని గుర్తుచేస్తున్న స్మిత…
సిల్క్ స్మితని గుర్తు చేస్తూ.. అచ్చం సిల్క్ స్మితలానే కైపెక్కించే చూపులతో నెట్టింట హల్ చల్ చేస్తోంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫొటోలు చూసిన యువకులు ఆమె అందాలకు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న దివి సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ లో కూడా బిజీగా ఉంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అందరి దృష్టి తనవైపు కి తిప్పుకుంటోంది.
































